భారత్ లో.. గత 8 రోజుల్లో.. లక్ష మందికి కరోనా..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి కేసుల సంఖ్య నాలుగు లక్షల మార్కును దాటి 4,10,461కి చేరింది. జనవరి 30న దేశంలో
Coronavirus In India: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి కేసుల సంఖ్య నాలుగు లక్షల మార్కును దాటి 4,10,461కి చేరింది. జనవరి 30న దేశంలో తొలి వైరస్ కేసు వెలుగుచూడగా మార్చిలో తొలి లక్ష మార్కు చేరేందుకు 78 రోజుల సమయం పట్టింది. అనంతరం కరోనా విజృంభన మరింత పెరిగింది. కేవలం 15 రోజుల్లోనే 2 లక్షల మార్కును చేరగా, అనంతరం పది రోజుల్లో కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. తాజాగా 8 రోజుల్లోనే కొత్తగా లక్ష వైరస్ కేసులు నమోదు కాగా ఈ సంఖ్య నాలుగు లక్షలను దాటింది.
వివరాల్లోకెళితే.. తొలుత చాలా నెమ్మదిగా ప్రారంభమైన కరోనా సంక్రమణం.. లాక్ డౌన్ సడలింపులతో ఊపందుకుంది. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు కరోనా వ్యాపించింది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కోసారి జోరు బాగా తగ్గినట్లు కనిపిస్తున్నా.. మరోసారి బాగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో మే 19 నుంచి జూన్ 20 వరకు నమోదైన కేసులే 75 శాతంపైగా ఉన్నాయి. అంటే సుమారు నెల రోజుల్లో దేశవ్యాప్తంగా కేసుల నమోదు మూడు రెట్లు పెరిగింది. ఈ నెల రోజుల్లో కరోనా పరీక్షల రేటు 4.6 శాతం నుంచి 7.8 శాతానికి పెరిగింది.
Also Read: కరోనా కట్టడకోసం ‘కఫసుర’.. ఐదు రోజుల్లోనే..