మోదీని విమర్శిస్తే అంతే.. మణిరత్నాన్ని వదల్లేదు !

నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ ఏకంగా ప్రధాన మంత్రినుద్దేశించి బహిరంగ లేఖ రాసిన 50 మందికి బీహార్ లోని ఓ జిల్లా కోర్టు షాకిచ్చింది. 3 నెలల క్రితం దేశంలో అసహనం పెరిగిపోతుందని, మోబ్ లించింగ్ మితిమీరుతుందంటూ అదూర్ గోపాల కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, అపర్ణాసేన్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ సహా మొత్తం 50 మంది సెలెబ్రిటీలు ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బహిరంగ లేఖ […]

మోదీని విమర్శిస్తే అంతే.. మణిరత్నాన్ని వదల్లేదు !
Rajesh Sharma

| Edited By: Ram Naramaneni

Oct 04, 2019 | 4:02 PM

నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ ఏకంగా ప్రధాన మంత్రినుద్దేశించి బహిరంగ లేఖ రాసిన 50 మందికి బీహార్ లోని ఓ జిల్లా కోర్టు షాకిచ్చింది. 3 నెలల క్రితం దేశంలో అసహనం పెరిగిపోతుందని, మోబ్ లించింగ్ మితిమీరుతుందంటూ అదూర్ గోపాల కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, అపర్ణాసేన్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ సహా మొత్తం 50 మంది సెలెబ్రిటీలు ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బహిరంగ లేఖ రాశారు. అప్పట్లో ఈ లేఖ జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం స‌ృష్టించింది. ఈ లేఖ వెనుక వామపక్ష భావజాల ప్రభావం వుందని, కమ్యూనిస్టు భావజాలంతోనే వారంతా మోదీని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నించారని కాషాయదళం, దానికి అనుబంధంగా మరో 62 మంది సెలెబ్రిటీలు ఎదురు దాడి చేశారు.

అయితే తాజాగా ఈ అంశం మరోసారి తెరమీదికొచ్చింది. అత్యంత కీలకమైన తరుణంలో ప్రధాని స్థాయి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చేందుకే 50 మంది సెలెబ్రిటీలు ప్రయత్నించారంటూ కొంత మంది బీహార్ లోని ముజఫర్ నగర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో సహా 50 మంది సెలెబ్రిటీల దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేయాలని ముజఫర్‌నగర్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ముజఫర్ నగర్ కు చెందిన న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా రెండు నెలల క్రితం ఫైల్ చేసిన పిటిషన్ ను విచారించిన చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 50 మంది సెలెబ్రిటీలపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశామని ముజఫర్ నగర్ పోలీసులు తెలిపారు.

బహిరంగ లేఖ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ ఇమేజీతోపాటు దేశ ప్రతిష్టను ఈ 50 మంది దిగజార్చారన్నది పిటిషనర్ ప్రధాన అభియోగం. కోర్టు ఆదేశాల మేరకు ఈ 50 మందిపై పబ్లిక్ న్యూసెన్స్, మతపరమైన భావాలను దెబ్బతీయడం, శాంతి భద్రతలకు భంగం వాటిల్ల జేయడం వంటి అభియోగాలతో ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ముజఫర్ నగర్ పోలీసులు వెల్లడించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu