Farmers Protest : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళన.. 66వ రోజుకు చేసిన పోరాటం

ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. సోమవారంతో వారి నిరసన దీక్షలు 66వ రోజుకు చేరాయి. కర్షకులకు మద్దతుగా పలు ప్రాంతాల నుంచి అన్నదాతలు భారీగా..

Farmers Protest : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళన.. 66వ రోజుకు చేసిన పోరాటం
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 03, 2021 | 5:21 PM

Farmers Protest : ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. సోమవారంతో వారి నిరసన దీక్షలు 66వ రోజుకు చేరాయి. కర్షకులకు మద్దతుగా పలు ప్రాంతాల నుంచి అన్నదాతలు భారీగా తరలివస్తున్నారు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన ఘాజీపూర్‌ వద్దకు భారీగా రైతులు చేరుకోవడంతో ఉదయం అక్షర్‌ధామ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వాహనాలను నొయిడా వైపు మళ్లించారు. ఉత్తరప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసు అధికారులు ఢిల్లీ, హర్యానా బోర్డర్‌ను బ్లాక్ చేస్తున్నారు. ముళ్ల తీగలతో కంచెలతో గోడలు కడుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేస్తున్నారు రైతులు. వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలని రైతు సంఘ నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్చేశారు.

బోర్డర్‌కు సమీపంలో ఉన్న ఢిల్లీ మెట్రోకు సంబంధించిన నాలుగు స్టేషన్లనూ తాత్కాలికంగా మూసివేశారు. ఫలితంగా ఢిల్లీ నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది. ట్రాఫిక్‌ కాస్త నెమ్మదించాక… మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్టు మెట్రో అథారిటీ తెలిపింది. ఫార్మర్‌ ప్రొటెస్టుతో సంబంధం ఉన్న అకౌంట్లను ట్విట్టర్ హోల్డ్ చేసి పెట్టింది.

మల్టిపుల్ అకౌంట్లు ఉన్నందునే ఈ చర్యలు తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 120 మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అరెస్టైన వ్యక్తుల్లో 20ఏళ్లలోపు వారు 15 మంది ఉన్నారు. 70 ఏళ్ల ఏళ్ల వ్యక్తి ఒకరు. 80 ఏళ్ల వ్యక్తి ఒకరు ఉన్నారు.

ర్యాలీ సందర్భంగా చనిపోయిన రైతుపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలపైనా కేసులు నమోదు చేశారు. రాజ్‌దీప్‌ సర్దేశాయ్. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కేసులు నమోదైన వారిలో ఉన్నారు. ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద ఓ పాత్రికేయుడిని అరెస్టు చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో మన్‌దీప్‌ పునియా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు.

ట్రాక్టర్ ర్యాలీకి వచ్చి తప్పి పోయిన 100 మంది కోసం పంజాబ్‌ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. హర్యానా, ఢిల్లీలో వెతుకుతున్నారు. హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొని తప్పిపోయిన వాళ్లను వీలైనంత త్వరగా కుటుంబ సభ్యుల వద్దకు చేరుస్తామంటున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి. మరోవైపు వీళ్ల కోసం ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ ఆధ్వర్యంలో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటైంది.

వీరి గురించి సమాచారాన్ని సేకరించి తగిన చర్య కోసం అధికార వర్గాలకు అందజేసే పనిని ఈ కమిటీ చూస్తుంది. ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్ వంటి సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలు రేపు రాత్రి 11 గంటల వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

ఢిల్లీ సరిహద్దుల్లో వివిధ చోట్ల అంతర్జాల సేవలు నిలుపు చేయడంపై రైతు నేతలు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఘర్షణల్లో గాయపడిన పోలీసులకు పరిహారం ప్రకటించారు ఢిల్లీపోలీసులు. తీవ్రంగా గాయపడిన వారికి పాతికవేలు… స్వల్పగాయాలు అయిన వారికి పదివేలు ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..