సినీ రచయిత సుద్దాల అశోక్ తేజకు కాలేయ మార్పిడి..
ప్రముఖ సినీ గేయ రచయిత అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ..

ప్రముఖ సినీ గేయ రచయిత అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అశోక్ తేజకు చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ.. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అయితే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని పేర్కొన్నారు.
కాగా రచయిత సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలపై నటుడు ఉత్తేజ్ స్పందించాడు. ‘మా మావయ్య ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వార్తలు నిజమే. చికిత్స కోసం ఆయనని హాస్పిటల్‌లో చేర్పించాం. శనివారం సాయంత్రం శస్త్ర చికిత్స జరగనుందన్నాడు’. అయితే సర్జరీ సమయంలో రక్తం అవసరమౌతుందేమోనని మావయ్య.. తన స్నేహితుడితో చెప్పారు. ఆయన ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో.. రకరకాల వార్తలు వస్తున్నాయి. రక్తం అవసరం ఉన్న మాట వాస్తవమే. దాని కోసం నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి కాల్ చేశాను. వాళ్లు స్పందించి రక్త దాతలను పంపిస్తామన్నారు. అలాగే మావయ్య ఆరోగ్యం గురించి తెలిసి చిరంజీవి ఉదయాన్నే కాల్ చేశారు. మావయ్యతో కూడా మాట్లాడి, ధైర్యం చెప్పారని ఉత్తేజ్ వెల్లడించాడు.
Read More:
బ్రేకింగ్: మరో మూడు నెలల మారటోరియం పెంచిన ఆర్బీఐ
బ్లాక్‌లో రైల్వే టికెట్ల అమ్మకం.. ఆరు లక్షల విలువైన టికెట్లను..