ఈ.ఎస్.ఐ.స్కాం: తెరవెనుక పెద్దలెవరు ? మాజీ మంత్రి అల్లుని అరెస్ట్ తప్పదా ?

తెలంగాణలో జరిగిన మెడికల్ స్కామ్‌లో తవ్వే కొద్ది నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి వెనుక ఎవరున్నారు..? మాజీ మంత్రి అల్లుడికి, దేవికారిణికి మధ్య డీల్ ఏంటి..? వీరితో పాటు స్కామ్‌కి సంబంధమున్న ఆ జర్నలిస్ట్ ఎవరు..? మాజీ మంత్రి అల్లుడిని అరెస్టు చేస్తారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈఎస్ఐ ఆస్పత్రిలో మెడికల్ స్కామ్ మరోసారి కలకలం రేపుతోంది. స్కాములో తెర వెనుక భాగోతం భారీ స్థాయిలోనే జరిగిందని తెలుస్తోంది. ఈ అవినీతి భాగోతంలో కింగ్ […]

ఈ.ఎస్.ఐ.స్కాం: తెరవెనుక పెద్దలెవరు ? మాజీ మంత్రి అల్లుని అరెస్ట్ తప్పదా ?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2019 | 8:34 PM

తెలంగాణలో జరిగిన మెడికల్ స్కామ్‌లో తవ్వే కొద్ది నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి వెనుక ఎవరున్నారు..? మాజీ మంత్రి అల్లుడికి, దేవికారిణికి మధ్య డీల్ ఏంటి..? వీరితో పాటు స్కామ్‌కి సంబంధమున్న ఆ జర్నలిస్ట్ ఎవరు..? మాజీ మంత్రి అల్లుడిని అరెస్టు చేస్తారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈఎస్ఐ ఆస్పత్రిలో మెడికల్ స్కామ్ మరోసారి కలకలం రేపుతోంది. స్కాములో తెర వెనుక భాగోతం భారీ స్థాయిలోనే జరిగిందని తెలుస్తోంది. ఈ అవినీతి భాగోతంలో కింగ్ పిన్ దేవిక రాణి వెనుక పెద్ద మనుషుల హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దేవికా రాణితో కలిసి బిజినెస్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న తెలంగాణకు చెందిన ఒక మాజీ మంత్రి అల్లుడు ఈ స్కాములో కీలక పాత్రధారిగా వ్యవహరించినట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఒక మాజీ మంత్రి గతంలో నిర్వహించిన కీలక శాఖా అధికారాల ద్వారా దేవికారాణిని దారిలోకి తెచ్చుకుని మందుల కొనుగోళ్లలో, వాటిని ఇతర ప్రైవేట్ హాస్పిటళ్ళకు తరలింపులో అత్యంత కీలకంగా వ్యవహరించినట్టు ఏసీబీకి సమాచారం ఉంది. భారీ స్థాయిలో మెడిసిన్స్ కొన్నట్టు లెక్కల్లో చూపించి.. వాటిని ఈ.ఎస్.ఐ. ఆస్పత్రిలోనే రోగులకు వినియోగించినట్టు రికార్డ్స్ సృష్టించినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ.ఎస్.ఐ ఆస్పత్రిలో అస్సలు వినియోగించని మందులను కొనుగోలు చేసి, అక్కడే వాడినట్టు రికార్డ్స్ సృష్టించి ఆ మెడిసిన్స్‌ని ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించడం ద్వారా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. దేవికారాణి పరిధిలో పని చేసే దాదాపు 18 నుంచి 20 మందిని ఈ మెడిసిన్స్ స్కాం లో భాగస్తులను చేసినట్టు ఏసీబీ అధికారులు కనుగొన్నారు.

ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏసీబీ అధికారులు రెండ్రోజులుగా ఈఎస్ఐకి సంబంధించిన అధికారులు, డైరెక్టర్ దేవికారాణి ఇళ్లలో సాదాలు నిర్వహించారు. ఏకకాలంలో 23 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌లో ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కూడా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. రెండ్రోజులగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులు దేవికారాణి ఇంట్లో పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణిని అరెస్ట్ చేసి.. బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈఎస్ఐ ఉద్యోగులే బినామీలుగా రూ. 200 కోట్ల మెడిసిన్ స్కామ్‌కు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది.

డైరెక్టర్ దేవికారాణి, మాజీ మంత్రి అల్లుడితో కలిసి పలు బినామి కంపెనీలను నడుపుతున్నారని ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. అంతేకాదు వీరితో పాటు ఈ స్కామ్‌లో ఓ జర్నలిస్టుకు కూడా సంబంధం ఉన్నట్లు తేలింది. అవసరం లేకపోయినా రూ. 200 కోట్ల విలువైన మందులను కొన్నారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. కొన్న మందులను సప్లై చేయకుండా.. బిల్లులు సృష్టించినట్లు ఏసీబీ గుర్తించింది. ఈఎస్ఐ మందులతో పాటు, వైద్య పరికరాల కోనుగోళ్లలో కూడా భారీగా అక్రమాలు బయటపడ్డాయి.

ఏసీబీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ పద్మలో పాటు 8 మందిని అరెస్టు చేశారు. మరోవైపు ముషీరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసులో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 2015 నుంచి 2018 వరకు ప్రభుత్వానికి రూ.12 వందల కోట్ల నష్టం కలిగించినట్లుగా తేలింది. ఇక మాజీ మంత్రి అల్లుడిని కూడా విచారించేందుకు ఏసీబీ అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.