‘దొంగ ఏనుగు’ బస్సును ఆపి ఫుడ్ ఎలా లాగించేసిందో ! పట్టపగలు ‘భారీ చోరీ’ !ఇలాంటి గజరాజులూ ఉంటాయా ?

'దొంగ ఏనుగు' బస్సును ఆపి ఫుడ్ ఎలా లాగించేసిందో ! పట్టపగలు 'భారీ చోరీ' !ఇలాంటి గజరాజులూ ఉంటాయా ?

ఏనుగుల్లో 'దొంగ ఏనుగులు' కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆహారం కోసం పట్టపగలు ఓ బస్సును ఆపేసి 'దోపిడీ' చేసి..తనక్కావలసింది తిని చక్కాపోయిన ఓ గజరాజు కథ ఇది  !

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Nov 12, 2020 | 9:00 PM

ఏనుగుల్లో ‘దొంగ ఏనుగులు’ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆహారం కోసం పట్టపగలు ఓ బస్సును ఆపేసి ‘దోపిడీ’ చేసి..తనక్కావలసింది తిని చక్కాపోయిన ఓ గజరాజు కథ ఇది  ! శ్రీలంక లోని ‘కటరంగమా ‘ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ఈ ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడి ‘ఆపేసింది’. వాహనం ఆగగానే డ్రైవర్ కిటికీలోనుంచి తొండాన్ని జొప్పించి బస్సులోని బియ్యం, అరటిపళ్ళను లాగేసుకుంది. పక్కనున్న ఓ ప్రయాణికుడు కూడా బెంబేలెత్తిపోయి మిగిలి ఉన్న అరటిపళ్ళ గెలను అందించాడు. ఈ క్రమంలో గజరాజు తొండం తన మెడ చుట్టూ బిగుసుకున్నట్టు ఉండగా  విడిపించుకోవడానికి డ్రైవర్ నానా తంటాలు పడ్డాడు. చివరకు తనకు అవసరమైన ఆహారం లభించగానే ఆ ‘దొంగ ఏనుగు’ బస్సును వదిలింది. బతుకుజీవుడా అనుకుంటూ డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదిలించాడు. రెండేళ్ల క్రితం నాటి ఈ వీడియో ఇప్పుడు మళ్ళీ హల్చల్ చేస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu