ఎమ్మెల్యే హాస్టల్‌పై ఐటీ అధికారుల దాడి
చెన్నై : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చెన్నై నగరంలోని ఎమ్మెల్యే హాస్టల్‌పై ఐటీ శాఖ, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు హాస్టల్లో డబ్బులు దాచారన్న సమాచారం అందడంతో అధికారులు చెన్నైలోని ఎమ్మెల్యే హాస్టల్ పై ఆకస్మిక దాడులు చేశారు. తమిళనాడు రెవెన్యూశాఖ మంత్రి ఆర్బీ ఉధ్యాయ కుమార్ తోపాటు మరో ఇద్దరు శాసనసభ్యుల గృహాలపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసి తనిఖీలు జరిపారు. ఆదివారం రాత్రి […]
చెన్నై : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చెన్నై నగరంలోని ఎమ్మెల్యే హాస్టల్‌పై ఐటీ శాఖ, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు హాస్టల్లో డబ్బులు దాచారన్న సమాచారం అందడంతో అధికారులు చెన్నైలోని ఎమ్మెల్యే హాస్టల్ పై ఆకస్మిక దాడులు చేశారు. తమిళనాడు రెవెన్యూశాఖ మంత్రి ఆర్బీ ఉధ్యాయ కుమార్ తోపాటు మరో ఇద్దరు శాసనసభ్యుల గృహాలపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసి తనిఖీలు జరిపారు. ఆదివారం రాత్రి వరకు చేపట్టిన ఈ తనిఖీల్లో డబ్బులు దొరికాయా లేదా అన్న విషయం మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు.