ఐటీ దాడులపై వివరణ కోరిన ఈసీ

| Edited By: Srinu

Apr 09, 2019 | 7:37 PM

సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా పలువురు నేతల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పీసీ మోదీలను ఈసీ సమావేశానికి పిలిచింది. ఇటీవల ఆదాయపు పన్నుశాఖ దాడులపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. బీజేపీ వివిధ శాఖలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. దీంతో ఇప్పటికే ఆర్థిక శాఖకు సూచనలు జారీ […]

ఐటీ దాడులపై వివరణ కోరిన ఈసీ
Follow us on

సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా పలువురు నేతల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పీసీ మోదీలను ఈసీ సమావేశానికి పిలిచింది. ఇటీవల ఆదాయపు పన్నుశాఖ దాడులపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. బీజేపీ వివిధ శాఖలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. దీంతో ఇప్పటికే ఆర్థిక శాఖకు సూచనలు జారీ చేసిన ఈసీ.. దాడులు ఏవైనా నిష్పాక్షికంగా చేయాలని, వేధింపులు వద్దని సూచించిన విషయం తెలిసిందే. కాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కర్ణాటక, తమిళనాడు, ఏపీ, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ఐటీ శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే.