AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నదుల కలుషితానికి ప్రధాన కారకాలు అవే

దైనందిన జీవితంలో నీటి ప్రాధాన్యత చాలా ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వారు నీరు లేకుండా చాలా పనులు జరగవు. అయితే గ్లోబలైజేషన్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి పెరిగిపోతుండగా.. మరోవైపు కాలుష్యం నీటి వనరులపై చాలా ప్రభావాన్ని చూపుతోంది. నీటి కాలుష్యం వలన కేవలం మనుషులే కాదు జలజీవరాశులు కూడా పెద్ద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే నీటి వనరులు కలుషితం అయ్యేందుకు మొదటి కారణం ప్లాస్టిక్ అని పరిశోధకులు స్పష్టం […]

నదుల కలుషితానికి ప్రధాన కారకాలు అవే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 09, 2019 | 4:51 PM

Share

దైనందిన జీవితంలో నీటి ప్రాధాన్యత చాలా ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వారు నీరు లేకుండా చాలా పనులు జరగవు. అయితే గ్లోబలైజేషన్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి పెరిగిపోతుండగా.. మరోవైపు కాలుష్యం నీటి వనరులపై చాలా ప్రభావాన్ని చూపుతోంది. నీటి కాలుష్యం వలన కేవలం మనుషులే కాదు జలజీవరాశులు కూడా పెద్ద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే నీటి వనరులు కలుషితం అయ్యేందుకు మొదటి కారణం ప్లాస్టిక్ అని పరిశోధకులు స్పష్టం చేశారు.

యూకే, యూరప్‌లోని తొమ్మిది మంచి నీటి నదులపై ఎర్త్‌వాచ్ ఇనిస్టిట్యూట్, ప్లాస్టిక్ ఓషియన్స్ యూకే సంస్థలు ఇటీవల పరిశోధనలు చేశాయి. వారి పరిశోధనల్లో నీరు కలుషితం అవ్వడానికి ప్లాస్టిక్ బాటిల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తేలింది. అలాగే ఆహార పాకెట్లు, సిగరెట్ వ్యర్థాలు కూడా నీటిని కలుషితం చేస్తున్నాయని వారు వెల్లడించారు. ప్లాస్టిక్‌ను తగ్గించడం వలన నీటి కాలుష్యాన్ని చాలా మేరకు అరికట్టవచ్చని వారు పేర్కొన్నారు.

ప్రతి మనిషి ఒక సంవత్సరం కాలంలో దాదాపుగా 150 వాటర్ బాటిల్స్‌ను వాడుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరు రీయూజబుల్ బాటిల్స్‌ను వాడటం అలవాటు చేసుకోవాలని వారు చెప్పారు. అలా చేసినట్లైతే నదుల కాలుష్యంతో పాటు భూ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని వారు చెప్పుకొచ్చారు.

రేపే చంద్ర సంచారం.. వీరు జాగ్రత్త ఉండకపోతే ముప్పు తిప్పలు తప్పవు!
రేపే చంద్ర సంచారం.. వీరు జాగ్రత్త ఉండకపోతే ముప్పు తిప్పలు తప్పవు!
సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే
సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే
ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే ఇంకేం తినరు..
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే ఇంకేం తినరు..
ఏటీఎం చోరీకి వచ్చి అడ్డంగా బుక్కైన దొంగ.. అతను ఎవరో తెలిసి..
ఏటీఎం చోరీకి వచ్చి అడ్డంగా బుక్కైన దొంగ.. అతను ఎవరో తెలిసి..
ప్రెగ్నెంట్‌ సమయంలో మహిళలను ఎందుకని పాము కాటు వేయదు?
ప్రెగ్నెంట్‌ సమయంలో మహిళలను ఎందుకని పాము కాటు వేయదు?
ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్నారు..
ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్నారు..