AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. 18 ఏళ్లకే రోడ్డు ప్రమాదంలో యువ నటి దుర్మరణం!

హాలీవుడ్‌లో తన నటనతో గుర్తింపు పొందిన యువ నటి కేలీ హాటిల్ (Kaylee Hottle) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ (Godzilla vs. Kong), ‘గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ (Godzilla x Kong: The New Empire) చిత్రాల్లో జియా (Jia) పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కేలీ హాటిల్ (18) మంగళవారం తెల్లవారుజామున అమెరికాలోని మేరీల్యాండ్ లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. 18 ఏళ్లకే రోడ్డు ప్రమాదంలో యువ నటి దుర్మరణం!
Godzilla Vs Kong Actress Kaylee Hottle Death
Srilakshmi C
|

Updated on: Jul 23, 2026 | 11:30 AM

Share

మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో ఇజామ్స్‌విల్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న 1995 హోండా అకార్డ్ కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న కల్వర్ట్‌ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో కేలీ హాటిల్ తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించినట్లు అధికారులు తెలిపారు. కారులోని డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, మరో ప్రయాణికుడు వైద్య చికిత్సను నిరాకరించాడు. ప్రమాదానికి అతివేగం కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంకేత భాషలో తండ్రి భావోద్వేగ ప్రకటన

కేలీ హాటిల్ మరణ వార్తను ఆమె తండ్రి జోషువా హాటిల్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా అమెరికన్ సైన్ లాంగ్వేజ్ (ASL)లో వెల్లడించారు. కేలీతో పాటు ఆమె తండ్రి కూడా చెవిటివారే. వారి కుటుంబం తరతరాలుగా చెవిటి వ్యాధితో బాధపడుతుంది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి మేరీల్యాండ్ వెళ్తున్నానని, ఆమెతో గడిపిన 18 సంవత్సరాలు మా జీవితంలో అమూల్యమైనవి కెలీ తండ్రి జోషువా హాటిల్ భావోద్వేగంగా తెలిపారు. అలాగే ప్రమాద సమయంలో కారు నడిపిన 19 ఏళ్ల యువకుడిని ఉద్దేశించి అతను చేసిన తప్పును క్షమించానని, ఈ ఘటనతో నీ జీవితాన్ని నాశనం చేసుకోనివ్వకని ఆయన పేర్కొన్నారు. కేలీకి తల్లి, తండ్రి, నలుగురు సోదరులు ఉన్నారు.

కేలీ హాటిల్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. నటి మిల్లీ బాబీ బ్రౌన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, ‘ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. కేలీ, నిన్ను ఎప్పటికీ మర్చిపోలేం’ అని రాశారు. కాగా త్వరలో విడుదల కానున్న ‘What Doesn’t Kill Us’ మువీలో ఆమెతో కలిసి నటించిన చెవిటి నటి అలాక్వా కాక్స్ కూడా కెలీ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్కార్ విజేత మార్లీ మ్యాట్లిన్ కేలీ అందం, ప్రతిభ చిరస్థాయిగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. మరో ఆస్కార్ విజేత ట్రోయ్ కోట్సర్ ఈ ఘటన నా కుమార్తెను గుర్తు చేసింది. జీవితంలోని ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించాల్సిన అవసరాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందని పోస్టులు పెట్టారు.

2021లో దర్శకుడు ఆడమ్ వింగార్డ్ తెరకెక్కించిన Godzilla vs Kong మువీలో కేలీ హాటిల్ ‘జియా’ అనే అనాథ బాలిక పాత్రలో నటించారు. సంకేత భాష ద్వారా కాంగ్‌తో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుచుకునే ఈ పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 2024లో విడుదలైన Godzilla x Kong: The New Empireలో కూడా ఆమె అదే పాత్రను పోషించారు. కేలీ హాటిల్ నటన మాత్రమే కాకుండా, తన ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, వృత్తిపరమైన నిబద్ధతతో ఎంతో మంది ఆదరాభిమానాలు పొందారు. ఆమెతో కమ్యూనికేట్ చేయడానికి నటుడు అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్ అమెరికన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లు గతంలో వెల్లడించారు. ‘మాగ్నమ్ పీఐ’ (Magnum PI) టెలివిజన్ సిరీస్‌లో కూడా కేలీ హాటిల్ నటించారు. అలాగే త్వరలో విడుదల కానున్న What Doesn’t Kill Us మువీలో కూడా కెలీ కనిపించనున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటిగా గుర్తింపు పొందిన కెలీ అకాల మరణం హాలీవుడ్‌ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Follow Us
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు