మాజీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రికి ఈసీ నోటీసులు

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలతో యుద్ధం రాజుకుంటుంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.

మాజీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రికి ఈసీ నోటీసులు
Follow us

|

Updated on: Oct 27, 2020 | 5:53 PM

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలతో యుద్ధం రాజుకుంటుంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్న నేతలపై అంతేస్థాయిలో సీరియస్ అవుతుంది. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి, ఆ రాష్ట్రంలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్య‌ర్థి ఇమార్తిదేవికి ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్య‌ల‌ు చేసి.. ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఆమెకు నోటీసులు జారీచేసిన‌ట్లు ఈసీ తెలిపింది. త‌మ నోటీసులకు 48 గంట‌ల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఇమార్తిదేవిని ఆదేశించింది. వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోతే ఇమార్తిదేవి ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు హెచ్చ‌రించింది.

ఇటీవ‌ల మ‌ధ్యప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ నేత క‌మ‌ల్‌నాథ్.. ఇమార్తిదేవి దేవిని ఉద్దేశించి ఐట‌మ్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై అప్ప‌ట్లో తీవ్ర దుమారం చెల‌రేగింది. ఈ నేప‌థ్యంలోనే ఉప ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హిస్తున్న ఇమార్తిదేవి.. క‌మ‌ల్‌నాథ్‌ను ఉద్దేశించి ఆయ‌న పేరెత్త‌కుండా పరుష పదజాలతో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి పోవ‌డంతో క‌మ‌ల్‌నాథ్‌కు పిచ్చిప‌ట్టింద‌న్నారు. బెంగాల్‌లో క‌మ‌ల్‌నాథ్ త‌ల్లి, చెల్లి కూడా ఐట‌మ్‌లే అంటూ వ్యాఖ్యానించారు. ఇమార్తిదేవి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఈసీ ఆమెకు నోటీసులిచ్చి వివ‌ర‌ణ కోరింది.

కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..