ఓటింగ్​ శాతాన్ని పెంచడంపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆలోచన..విదేశాల్లో భారతీయులకు పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్యం

కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆలోచనకు తెరలేపింది. ప్రజాస్వామ్య భారత దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఓ కొత్త ప్రతిపాధనను చేసింది. ఓటింగ్​ శాతాన్ని పెంచడంతోపాటు.. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో..

ఓటింగ్​ శాతాన్ని పెంచడంపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆలోచన..విదేశాల్లో భారతీయులకు పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్యం
Follow us

|

Updated on: Dec 01, 2020 | 9:49 PM

కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆలోచనకు తెరలేపింది. ప్రజాస్వామ్య భారత దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఓ కొత్త ప్రతిపాధనను చేసింది. ఓటింగ్​ శాతాన్ని పెంచడంతోపాటు.. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో పారదర్శకత పెంచేందుకు నూతన ప్రతిపాదికను తెరమీదికి తీసుకొచ్చింది.

విదేశాల్లోని అర్హత కలిగిన భారతీయులు ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్యాన్ని విస్తరించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శికి నవంబర్​ 27న లేఖ రాసింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు, బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్​ సౌకర్యాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల విశ్వాసం పెరిగిందని పేర్కొంది.

రానున్న అసోం, బంగాల్​, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విధానం అమలు చేయడానికి కావాల్సిన సాంకేతిక, పరిపాలనపరమైన సదుపాయాలను సిద్ధం చేసుకున్నట్లు లేఖలో వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్​ నెలల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

వృద్ధులు, విదేశాల్లోని అర్హత ఉన్న భారతీయులు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని తెలిపింది ఎన్నికల సంఘం. వారూ ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్​ బ్యాలెట్​ను విస్తరించాలనే ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో… ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.ఈసీ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే విదేశాల్లోని భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సెలబ్రిటీల సందడి.. వీడియో
కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సెలబ్రిటీల సందడి.. వీడియో
తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలా.. ఇవిగో బెస్ట్ ఆప్షన్లు..
తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలా.. ఇవిగో బెస్ట్ ఆప్షన్లు..
సూపర్ ఫాస్ట్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసిన లెనోవో
సూపర్ ఫాస్ట్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసిన లెనోవో
నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ ఇదే.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ ఇదే.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
రూ.1074కే జ్యోతిర్లింగాల ట్యూర్ ప్యాకేజ్
రూ.1074కే జ్యోతిర్లింగాల ట్యూర్ ప్యాకేజ్
అతి తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త ఫోన్లు ఇవి.. ఏది బెస్ట్?
అతి తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త ఫోన్లు ఇవి.. ఏది బెస్ట్?