కశ్మీర్ అధికార యంత్రాంగం కీలక నిర్ణయం, డిసెంబర్ 31వరకు విద్యాసంస్థలు బంద్, మరికొన్ని కీలక ఆదేశాలు
జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసే ఉంటాయని ప్రకటించింది.
జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసే ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే.. 9 నుంచి 12 వ తరగతికి చెందిన విద్యార్థులు స్వచ్ఛందంగా స్కూల్స్‌కు రావొచ్చని తెలిపింది. ఆన్లైన్ విద్యను యథావిధిగా కొనసాగించవచ్చని జమ్ముకశ్మీర్ యంత్రాంగం తెలిపింది. ఇక ఉత్తర్వుల్లో మరికొన్ని కీలక అంశాలు పొందుపరిచారు.
థియేటర్లను 50శాతం సామర్థ్యంతో తెరుచుకోవచ్చని పేర్కొన్నారు. వివాహ వేడుకల్లో 100 మంది అతిథులు మాత్రమే పాల్గొనాలని, ఆన్లైన్ విద్య కోసం పాఠశాలలకు ఉపాధ్యాయ, ఉపాధ్యేయతర సిబ్బంది 50 శాతం వరకు హాజరుకావచ్చని సూచించారు. శాస్త్ర, సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న పీజీ, రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు తమ విద్యాసంస్థల్లో ప్రయోగశాలల కోసం హాజరుకావచ్చని వివరించారు. ప్రార్థన మందిరాలు తెరిచే ఉంటాయి. కానీ, భారీ సంఖ్యలో జనంతో ప్రేయర్ మీటింగ్స్ నిర్వహించడానికి వీల్లేదని సూచించారు.
Also Read :
AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !
Ind vs Aus : రెండో వన్డేలో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు