Sourav Ganguly health update: దాదా ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల..నేడు ఈకో కార్డియోగ్రఫీ నిర్వహించనున్న వైద్యులు
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి తాజాగా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు అందులో పేర్కొన్నారు.
Sourav Ganguly health update: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి తాజాగా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు అందులో పేర్కొన్నారు. యాంజియోప్లాస్టి ఆనంతరం ఆయన కోలుకుంటున్నట్లు తెలిపారు. గంగూలీ గుండె పనితీరును తెలుసుకునేందుకు ఆయనకు సోమవారం చెక్-అప్ ఈకో కార్డియోగ్రఫీ నిర్వహిస్తామని వివరించారు. గంగూలీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
గంగూలీకు తదుపరి చికిత్స ప్రణాళికను ఆయన కుటుంబ సభ్యులతో చర్చించడానికి ఈ రోజు ఉదయం 11:30 గంటలకు 9 మంది సభ్యులతో కూడిన మెడికల్ బోర్డు సమావేశమవుతుందని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ తెలిపింది. గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆసుపత్రి వెల్లడించింది.
శనివారం ఉదయం 11 గంటలకు వ్యాయామం చేస్తున్నప్పుడు 48 ఏళ్ల భారత మాజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు వెంటనే దాదాను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వివిధ పరీక్షలు చేసిన డాక్టర్లు రక్తనాళాలు మూడు చోట్ల మూసుకుపోవడంతో యాంజియోప్లాస్టీ నిర్వహించి..స్టెంట్ వేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం సాయంత్రం వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి వెళ్లి గంగూలీ ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
Also Read :