Mushrooms Uses: పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. క్యాన్సర్‌కు కూడా చెక్ పెట్టొచ్చు..

|

Aug 11, 2024 | 11:40 AM

పుట్టగొడుగుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో చాలా మంది పుట్టగొడుగులను తింటున్నారు. పుట్ట గొడుగుల్లో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది మష్రూమ్స్‌ని నాన్ వెజ్ అనుకుని.. తినడం లేదు. కానీ పుట్ట గొడుగులు కూడా శాకాహారమే. వీటితో చేసిన ఆహారాలు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలు విలువలు కూడా కలిగి ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు, యాంటీ..

Mushrooms Uses: పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. క్యాన్సర్‌కు కూడా చెక్ పెట్టొచ్చు..
Mushrooms Uses
Follow us on

పుట్టగొడుగుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో చాలా మంది పుట్టగొడుగులను తింటున్నారు. పుట్ట గొడుగుల్లో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది మష్రూమ్స్‌ని నాన్ వెజ్ అనుకుని.. తినడం లేదు. కానీ పుట్ట గొడుగులు కూడా శాకాహారమే. వీటితో చేసిన ఆహారాలు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలు విలువలు కూడా కలిగి ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా చాలా ఉంటాయి. మష్రూమ్స్‌లో క్యాలరీలు, కొవ్వుల శాతం అనేది చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు ఎలాంటి డౌట్ లేకుండా తినవచ్చు. పుట్ట గొడుగులు తినడం వల్ల క్యాన్సర్, బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మరి మష్రూమ్స్‌ని తింటే ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

సాధారణంగా వర్షా కాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యల బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. ఇమ్యూనిటీని పెంచే ఆహారాల్లో పుట్ట గొడుగులు కూడా ఒకటి. రోగ నిరోధక వ్యవస్థలో మైక్రోఫేజ్‌లను మష్రూమ్స్ ప్రేరేపిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బాగా బలపడుతుంది. త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉంటారు.

క్యాన్సర్‌ను నివారిస్తుంది:

మష్రూమ్స్ తినడం వల్ల క్యాన్సర్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. పలు అధ్యయనాల ప్రకారం పుట్ట గొడుగులను ఎక్కువగా తినే వారిలో క్యాన్సర్ కణాలు అనేవి పెరగకుండా ఉంటాయి. దీంతో క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

డయాబెటీస్ ముప్పు తక్కువ:

పుట్ట గొడుగులు తినడం వల్ల డయాబెటీస్ బారిన పడే ముప్పు కూడా చాలా తక్కువ. వీటిల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం అనేది వేగంగా పెరగకుండా ఉంటుంది.

మెదడు ఆరోగ్యం:

పుట్ట గొడుగులు తినడం వలన మెదడు ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. ఇందులో ఉండే అనేక పోషకాలు మెదడు కణాలను యాక్టివ్ చేస్తాయి. జ్ఞాపక శక్తిని కూడా పెంచతాయి. బ్రెయిన్‌కి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే వారంలో ఒకసారి అయినా పుట్టగొడుగులు తినడం చాలా మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..