Breaking News : గుజరాత్ లో మళ్లీ భూకంపం..24 గంటల్లో రెండోసారి
గుజరాత్‌లో భూకంపాలు ప్రజలను కలవరపెడుతన్నాయి. సోమవారం మధ్యాహ్నం కచ్ ప్రాంతంలో మరోసారి భూ ప్రకపంనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రత నమోదైంది. మధ్యాహ్నం 12:57 గంటలకు కచ్‌ను భూకంపం తాకింది.
గుజరాత్‌లో భూకంపాలు ప్రజలను కలవరపెడుతన్నాయి. సోమవారం మధ్యాహ్నం కచ్ ప్రాంతంలో మరోసారి భూ ప్రకపంనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రత నమోదైంది. మధ్యాహ్నం 12:57 గంటలకు కచ్‌ను భూకంపం తాకింది. గత 24 గంటల్లో కచ్‌ను తాకిన రెండో భూకంపం ఇది.
An earthquake with a magnitude of 4.4 on the Richter Scale hit 83 km northwest (NW) of Rajkot, Gujarat at 12:57 pm today: National Center for Seismology (NCS)
— ANI (@ANI) June 15, 2020
గుజరాత్ లో ఆదివారం రాత్రి కూడా భూకంపం సంభవించింది. రాజ్‌కోట్, కచ్, అహ్మదాబాద్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రాజ్‌కోట్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా ఆదివారం రాత్రి 8.13 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై 5.8గా భూకంప తీవ్రత నమోదైంది. కాగా, భూ ప్రకంపనల సమయంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురై… ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. భూ ప్రకపంనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగలేదని తెలిసింది.