అక్షయ తృతీయకు లాక్ డౌన్ దెబ్బ

ఈ సంవత్సరం అక్షయ తృతీయకు లాక్ డౌన్ దెబ్బ గట్టిగా తగిలింది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున జరిగే బంగారం అమ్మకాలతో పోలిస్తే ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజు కేవలం మూడు శాతం వ్యాపారం జరిగిందని బంగారం నగల దుకాణాల యజమానులు వాపోతున్నారు.

అక్షయ తృతీయకు లాక్ డౌన్ దెబ్బ
Follow us

|

Updated on: Apr 26, 2020 | 5:01 PM

ఈ సంవత్సరం అక్షయ తృతీయకు లాక్ డౌన్ దెబ్బ గట్టిగా తగిలింది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున జరిగే బంగారం అమ్మకాలతో పోలిస్తే ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజు కేవలం మూడు శాతం వ్యాపారం జరిగిందని బంగారం నగల దుకాణాల యజమానులు వాపోతున్నారు.

గోల్డు అమ్మకాలు లేని అక్షయ తృతీయగా ఈ ఏడాది అక్షయ తృతీయ పర్వదినం మిగిలిపోతుందని జువెలరీ షాపుల యజమానులు చెప్పుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా దుకాణాలు తెరవలేని పరిస్థితి ఏర్పడడంతో అక్షయ తృతీయ సందర్భంగా ఆన్లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు పెట్టినా పెద్దగా వ్యాపారం జరగలేదని వారు చెబుతున్నారు.

గత ఏడాది దేశంలో అక్షయ తృతీయ సందర్భంగా 33 టన్నుల గోల్డు వ్యాపారం జరగగా.. మొత్తం ఒక రోజు వ్యాపారాన్ని 1550 కోట్ల రూపాయల వరకు అయిందని అంచనా వేశారు. కానీ, ఈఏడాది కనీసం 3 శాతం కూడా వ్యాపారాలు సాగలేదని వ్యాపారులు చెబుతున్నారు.

హైదరాబాద్ పరిస్థితి దారుణం

గత ఏడాది హైదరాబాద్ నగరంలో అక్షయ తృతీయకు ఏడున్నర టన్నుల బంగారం వ్యాపారం జరిగినట్లు సమాచారం. దాని విలువ 352 కోట్లకు పైగా ఉంటుందని లెక్క కట్టాయి ట్రేడ్ వర్గాలు. హైదరాబాద్ నగరంలో చిన్నా పెద్దా కలిపి మొత్తం నాలుగు వేల 130 జువెలరీ షాపులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఏటా జరిగే వ్యాపారంలో కేవలం మూడు శాతం బిజినెస్ జరిగిందని అంచనాలు ఉండగా హైదరాబాద్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజు జరిగే బంగారం వ్యాపారంలో కేవలం ఒక్క శాతం వ్యాపారం మాత్రమే ఈ ఏడాది జరిగిందని జువెలరీ షాపుల యజమానులు వాపోతున్నారు.

లాక్ డౌన్ కారణంగా జువెలరీ షాపులను మూసివేయడంతో హైదరాబాదులోని సోమాజిగూడా రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి పంజాగుట్ట చౌరస్తా వరకు మధ్యలో ఉన్న మార్గమంతా అక్షయ తృతీయ రోజు పోయినట్లు కనిపించింది. ఈ అర కిలోమీటరు రోడ్డులో దాదాపు యాభైకి పైగా జువెల్లరీ శాపులున్నాయి. దేశంలోనే ముంబై, చెన్నై తరువాత గోల్డు బిజినెస్ లో మూడో స్థానంలో హైదరాబాద్ ఉండేది. కానీ ఈ సంవత్సరం లాక్ డౌన్ కారణంగా దుకాణాలు మూసివేశారు. దాంతో పరిస్థితి తారుమారైంది.