Vijayawada: విజయవాడలో మంకీపాక్స్ లేదు.. చిన్నారి నమూనాల్లో నెగటివ్ గా నిర్ధరణ

విజయవాడలో(Vijayawada) కలకలం రేపిన మంకీపాక్స్ (Monkeypox) అనుమానాస్పద కేసుపై వైద్యులు వివరణ ఇచ్చారు. చిన్నారికి ఈ వైరస్ సోకలేదని నిర్ధరించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ చిన్నారికి మంకీఫాక్స్ వ్యాధి లక్షణాలు...

Vijayawada: విజయవాడలో మంకీపాక్స్ లేదు.. చిన్నారి నమూనాల్లో నెగటివ్ గా నిర్ధరణ
Vijayawada Ggh News
Follow us

|

Updated on: Jul 17, 2022 | 5:51 PM

విజయవాడలో(Vijayawada) కలకలం రేపిన మంకీపాక్స్ (Monkeypox) అనుమానాస్పద కేసుపై వైద్యులు వివరణ ఇచ్చారు. చిన్నారికి ఈ వైరస్ సోకలేదని నిర్ధరించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ చిన్నారికి మంకీఫాక్స్ వ్యాధి లక్షణాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమెకు వైరస్ సోకి ఉంటుందని అనుమానించారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించి, నమూనాలు సేకరించారు. వాటిని పుణె (Pune) లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. పరీక్షల్లో మంకీ పాక్స్‌ నెగెటివ్‌గా నిర్ధరణ అవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బాలిక కుటుంబం ఇతరులతో కాంటాక్టు కాలేదని ఆరోగ్యశాఖ కమిషనర్‌ తెలిపారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. మంకీపాక్స్ అనేది స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందిన వైరల్‌ వ్యాధి. ఇది జంతువుల నుంచి మానవులకు సోకుతుంది. స్మాల్ పాక్స్ లాగే మంకీపాక్స్ కు గురైన వ్యక్తి.. జ్వరం, తలనొప్పి, వాపు, నడుమునొప్పి, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలతో ఉంటారు. ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి.

వేగంగా విస్తరిస్తోన్న మంకీపాక్స్‌.. ఇప్పటికే 59 దేశాలకు పాకింది. ఈ కేసులు ఎక్కువగా యూరప్‌, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ముఖ్యంగా స్వలింగ సంపర్కుల్లోనే ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..