AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిస్కెట్లపై రంధ్రాల వెనక షాకింగ్ నిజం.. ఆ రహస్యం బయటపడింది!

వివిధ రుచులు, నాణ్యతతో కూడిన బిస్కెట్లు మార్కెట్లో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అలాంటి రంధ్రాలు లేని బిస్కెట్లు కూడా చాలా ఉన్నాయి. కానీ, ఇలా బిస్కెట్లలో ఇన్ని రంధ్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? బహుశా అందరూ లేదనే అంటారు. కాబట్టి, బిస్కెట్లలో ఇన్ని రంధ్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసుకుందాం..

బిస్కెట్లపై రంధ్రాల వెనక షాకింగ్ నిజం.. ఆ రహస్యం బయటపడింది!
Holes In Biscuits
Jyothi Gadda
|

Updated on: Feb 05, 2026 | 10:12 AM

Share

పిల్లల నుండి పెద్దల వరకు అందరూ బిస్కెట్లను ఇష్టపడతారు. టీ బిస్కెట్లు చాలా మందికి మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌, సాయంత్రం స్నాక్‌గా తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇక్కడ ఒక విషయం మీరు గమనించే ఉంటారు.. అదేంటంటే..ఈ బిస్కెట్లలో చాలా రంధ్రాలు ఉండటం మీరు చూసే ఉంటారు.. వివిధ రుచులు, నాణ్యతతో కూడిన బిస్కెట్లు మార్కెట్లో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అలాంటి రంధ్రాలు లేని బిస్కెట్లు కూడా చాలా ఉన్నాయి. కానీ, ఇలా బిస్కెట్లలో ఇన్ని రంధ్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? బహుశా అందరూ లేదనే అంటారు. కాబట్టి, బిస్కెట్లలో ఇన్ని రంధ్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసుకుందాం..

మీరు చాలాసార్లు రంధ్రాలు ఉన్న బిస్కెట్లను తినే ఉంటారు. చాలా మంది ఈ రంధ్రాలు కేవలం డిజైన్ కోసమే అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిజానికి, బిస్కెట్లలో ఈ రంధ్రాలను తయారు చేయడం వాటి తయారీలో ముఖ్యమైన భాగం. దీని వెనుక ఒక సైన్స్ ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.. ఎందుకంటే.. ఈ రంధ్రాలను డాకింగ్ హోల్స్ అంటారు.

ఇల్లు నిర్మించినప్పుడు గాలి, వెంటిలేషన్ కోసం రంధ్రాలు, ఖాళీలు ఎలా ఉంచబడతాయో, బిస్కెట్లలో రంధ్రాల వెనుక కారణం కూడా ఇలాంటిదే. వాస్తవానికి బేకింగ్ సమయంలో గాలి సులభంగా వాటి గుండా వెళ్ళేలా బిస్కెట్లలో రంధ్రాలు చేస్తారు. బిస్కెట్లు కాల్చేటప్పుడు ఆవిరి, గాలి బయటకు వెళ్లేలా ఈ రంధ్రాలు తయారు చేయబడతాయి. ఇది బిస్కెట్లు సమానంగా కాల్చడానికి కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

కానీ, మీరు ఈ రంధ్రాలను క్రాకర్స్ మరియు సాల్టీ బిస్కెట్లలో మాత్రమే చూస్తారు. తీపి బిస్కెట్లలో ఇవి అంతగా ఉండవు. ఎందుకంటే, ఉప్పుగా ఉండే బిస్కెట్లు తేమగా ఉంటాయి. తీపి బిస్కెట్లు మృదువుగా ఉంటాయి. వాటి పూత భిన్నంగా తయారు చేయబడుతుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..