ఏపీ ప్రజలకు అలెర్ట్.. రాష్ట్ర ప్రభుత్వం సూచనలు.. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి.!

|

Nov 14, 2020 | 8:23 AM

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీపావళి పండుగకు ముందుగానే పలు జాగ్రత్తలను సూచించింది. కరోనాకు తోడు ప్రజల ఆరోగ్యభద్రతను దృష్టిలో..

ఏపీ ప్రజలకు అలెర్ట్.. రాష్ట్ర ప్రభుత్వం సూచనలు.. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి.!
Follow us on

Diwali 2020: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీపావళి పండుగకు ముందుగానే పలు జాగ్రత్తలను సూచించింది. కరోనాకు తోడు ప్రజల ఆరోగ్యభద్రతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తల నడుమ వేడుకలను జరుపుకునేందుకు అనుమతిచ్చింది. దీపావళి అంటేనే టపాసుల సంబరం. అయితే పర్యావరణ హితమైన గ్రీన్‌క్రాకర్స్‌ను మాత్రం ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు.. అంటే రెండు గంటల పాటు పరిమితంగా కాల్చుకోవాలని కోరింది.

బాణాసంచా వినియోగానికి ప్రభుత్వం రెండు గంటల పాటు అనుమతి ఇవ్వడంతో.. వ్యాపారం కాస్త పుంజుకుంది. గతంలో ఉన్నంత హడావుడి లేకున్నా.. పండుగను జరుపుకునేవాళ్లు టపాసులను తీసుకెళ్తున్నారు. అయితే బాణసంచా దుకాణాలకు ఇష్టానుసారంగా అనుమతులను ఇవ్వలేదు. పరిమిత సంఖ్యలోనే కొన్ని షాపులకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది‌.

కాలుష్యం, కరోనా విస్తృతిపై ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా స్వచ్చందంగా టపాసుల వినియోగాన్ని తగ్గించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శీతాకాలంలో వైరస్‌లు వేగంగా విస్తరించే ప్రమాదం ఉండడంతో.. ముందస్తు హెచ్చరికలను చేస్తోంది. కరోనా బాధితులకు ఇది మరింత ప్రమాదకరం కావడంతో.. మాస్క్‌‌ను కూడా తప్పనిసరిగా ధరించాలని చెబుతోంది.

Also Read:

డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..

సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..