AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేధింపులకు దివ్యాంగురాలు బలి.. ముగ్గురు యువకులపై పోలీసుల కేసు.. న్యాయం చేయాలంటున్న తండ్రి చిట్టిబాబు

చిత్తూరు బంగారుపాళ్యం మండలం ఊటవంకలో దారుణం జరిగింది. ముగ్గురు యువకుల వేధింపులతో వికలాంగురాలైన ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స..

వేధింపులకు దివ్యాంగురాలు బలి.. ముగ్గురు యువకులపై పోలీసుల కేసు.. న్యాయం చేయాలంటున్న తండ్రి చిట్టిబాబు
Rajesh Sharma
|

Updated on: Nov 14, 2020 | 5:21 PM

Share

Disabled lady died of harassment: చిత్తూరు బంగారుపాళ్యం మండలం ఊటవంకలో దారుణం జరిగింది. ముగ్గురు యువకుల వేధింపులతో దివ్యాంగురాలైన ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది. దాంతో ఊటవంకలో విషాదం నెలకొంది.

వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది దివ్యాంగురాలైన పదిహేడేళ్ళ ఓ యువతి. అందుకు కారణం ఆమెకు స్నేహితులైన ముగ్గురు వ్యక్తులు దాము, జ్యోతిరావు, దిలీప్‌లు ఆమెను వేధింపులేనని యువతి తండ్రి చిట్టిబాబు ఆరోపిస్తున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన దివ్యాంగ యువతి.. గత వారం రోజులుగా తిరుపతి నగరంలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం ఆమె పరిస్థితి విషమించి మరణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆమె స్నేహితులైన దాము , జ్యోతీరావు , దిలీప్‌ల వేధింపుల వల్లే యువతి ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి చిట్టిబాబు ఆరోపిస్తున్నారు. ఇంట్లోంచి డబ్బులు తీసుకువెళ్ళిన యువతి.. ఆ మొత్తాలను స్నేహితులు ముగ్గురికి ఇచ్చిందని ఆయన చెబుతున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా వారు ముగ్గురు తనకుమార్తెను వేధించారని చిట్టిబాబు ఆరోపిస్తున్నాడు. చిట్టిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు దాము, జ్యోతీరావు, దిలీప్‌లపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతురాలి ఒంటిపై గాయాలున్నాయంటున్న తండ్రి.. తన కూతురు మరణానికి కారణమైన వారికి శిక్ష పడాలని కోరుతున్నారు.

ALSO READ: పారిశుధ్య కార్మికులకు బంపర్ ఆఫర్.. దీపావళి నాడు..

ALSO READ: దిగ్దర్శకుడు విశ్వనాథ్‌తో చిరంజీవి భేటీ

ALSO READ: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ గ్రేట్ న్యూస్… 50% శాతం రాయితీ