జూనియర్ బాలయ్య ‘గోకుల్’ కన్నుమూత 

జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోలో నందమూరి బాలకృష్ణగా మెప్పించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాల నటుడు గోకుల్ సాయికృష్ణ కన్నుమూశాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతోన్న గోకుల్ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన గోకుల్ డ్రామా జూనియర్స్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సింహా’ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులను అవలీలగా చెప్పేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాలకృష్ణ మేనరిజంతో ఆకట్టుకున్నాడు. జూనియర్ బాలయ్యగా […]

జూనియర్ బాలయ్య 'గోకుల్' కన్నుమూత 
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 18, 2019 | 8:25 PM

జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోలో నందమూరి బాలకృష్ణగా మెప్పించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాల నటుడు గోకుల్ సాయికృష్ణ కన్నుమూశాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతోన్న గోకుల్ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన గోకుల్ డ్రామా జూనియర్స్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సింహా’ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులను అవలీలగా చెప్పేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాలకృష్ణ మేనరిజంతో ఆకట్టుకున్నాడు. జూనియర్ బాలయ్యగా పేరు తెచ్చుకున్నాడు. ఆఖరికి ఆ నటసింహా నందమూరి బాలకృష్ణనూ కలిశాడు.

‘నేనంటే ప్రాణం ఇచ్చే చిన్నారి అభిమాని గోకుల్‌ ఈరోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటగా అనిపించేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ జ్వరంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం నాకు బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరై మంచి భవిష్యత్తు ఉన్న బాల నటుడు గోకుల్‌ను విధి వెక్కిరించింది. గోకుల్ మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలకృష్ణ అభిమానులు కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. గోకుల్ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.