Delhi University Recruitment: ఢిల్లీ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే.

Delhi University Recruitment 2021: దేశరాజధాని న్యూఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి చెందిన శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ ఉమెన్స్‌ కాలేజీ పలు ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న నాన్‌ టీచింగ్ పోస్టులను..

Delhi University Recruitment: ఢిల్లీ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే.
Delhi Univeristy Non Teching Posts

Updated on: Jul 02, 2021 | 12:42 PM

Delhi University Recruitment 2021: దేశరాజధాని న్యూఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి చెందిన శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ ఉమెన్స్‌ కాలేజీ పలు ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈనెల 16తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* 19 ఖాళీలకు గాను అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (01), సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ (01), సీనియర్‌ అసిస్టెంట్‌ (01), ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ (01), తబలా అకెంపనిస్ట్‌ (03), జూనియర్‌ అసిస్టెంట్‌ (04), ల్యాబొరేటరీ అటెండెంట్‌ (04), లైబ్రరీ అటెండెంట్‌ (04) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పోస్టు ఆధారంగా పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో అనుభవంతో ఉండాలి. ఇక తబలా, టైపింగ్‌, మ్యూజిక్‌ వంటి స్కిల్స్‌ తెలిసి ఉండాలి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు మొదట ఆన్‌లైన్‌లో తమ పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి అనంతరం దరఖాస్తును న్యూఢిల్లీలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కాలేజ్‌ (ఉమెన్‌), పంజాబి బాగ్‌ అడ్రస్‌కు పంపించాలి.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 16-07-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Road Stolen: రాత్రికి రాత్రే కిలోమీటర్ రోడ్డు మాయమైంది.. వెతికి పెట్టండి.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన గ్రామస్థులు..

Google Messages: పెద్ద ఎత్తున వస్తోన్న మెసేజ్‌లతో కన్ఫ్యూజ్‌ అవుతున్నారా.? అయితే ఈ కొత్త ఫీచర్ మీ కోసమే..

Viral Video: మొసళ్లతో అమ్మాయి ఆటలు.. దాని నోట్లో చెయ్యి పెట్టి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!