ఢీల్లిలో కొనసాగుతున్న కరోనా కరాళనృత్యం..!

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Nov 09, 2020 | 10:01 PM

దేశ వ్యాప్తంగా కరోనా రెండో విడత విజృంభణ కోరలుచాస్తోంది.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వికృతరూపం దాల్చుతోంది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులకు తోడు మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

ఢీల్లిలో కొనసాగుతున్న కరోనా కరాళనృత్యం..!

దేశ వ్యాప్తంగా కరోనా రెండో విడత విజృంభణ కోరలుచాస్తోంది.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వికృతరూపం దాల్చుతోంది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులకు తోడు మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నవంబర్‌ తొలి వారంలో 400 మందికిపైగా కరోనా కబంధహస్తాలకు బలయ్యారు. ఒకవైపు మూడోసారి కరోనా విజృంభణ, మరోవైపు పెరుగుతున్న గాలి కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజువారీ కేసుల నమోదులో మహారాష్ట్రను ఢిల్లీ అదిగమించింది. వారం రోజులుగా నిత్యం సుమారు ఏడు వేల వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నవంబర్‌ తొలి వారంలోనే 46 వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక ఒక్క వారంలో 427 మంది కరోనా రోగులు మరణించడం కలవరానికి గురిచేస్తోంది.

ఇకతాజాగా కరోనా కేసులు మూడు రెట్లు పెరిగాయి. ఆదివారం ఒక్క రోజే అత్యధికంగా 7,745 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 38 వేలు దాటగా మొత్తం మరణాల సంఖ్య ఏడు వేలకు చేరుకుంది. మరోవైపు, ఢిల్లీలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఆగస్టు నెలలో కరోనా రాకాసి బారినపడి 458 మరణిస్తే, సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 917కు పెరిగింది. అక్టోబర్‌ 1 నుంచి 31 వరకు 1,124 మంది వైరస్‌ వల్ల చనిపోయారు. ఇక నవంబర్‌ 1 నుంచి 7 వరకు వారం రోజుల్లో 427 మంది మృత్యువాతపడ్డారు. ఢిల్లీలో జూన్‌ నెలలో అత్యధికంగా 2,247 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజాగా, మరోసారి మరణాల రేటు పెరుగుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా మరణాల రేటు 1.59 శాతం ఉందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జాతీయ స్థాయి కన్నా ఇది కాస్త ఎక్కువ కావడం భయాందోళనలకు గురిచేస్తుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu