అమిత్ షా ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నామంటూ.. రూ.3 కోట్లు డిమాండ్!

ఇద్దరు ఆకతాయిలు సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి నుంచి ఫోన్ కాల్ చేస్తున్నామంటూ.. హర్యానా విద్యుత్ శాఖ మంత్రిని డబ్బు డిమాండ్ చేసిన ఘటన రాజకీయంగా సంచలనమైనది. జగ్తార్ సింగ్, ఉపకార్ సింగ్‌ అనే ఇద్దరు యువకులు ఓ టీవీ సీరియల్‌లో చూసిన సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఫేక్ ఫోన్ కాల్ డ్రామాకు ప్లాన్ రచించారు. వీరిద్దరూ భారత్‌లో నిషేదానికి గురైన ఒపెరా బ్రౌజర్ యాప్ ద్వారా హర్యానా విద్యుత్ శాఖ మంత్రి […]

అమిత్ షా ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నామంటూ.. రూ.3 కోట్లు డిమాండ్!
Follow us

|

Updated on: Dec 30, 2019 | 7:47 AM

ఇద్దరు ఆకతాయిలు సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి నుంచి ఫోన్ కాల్ చేస్తున్నామంటూ.. హర్యానా విద్యుత్ శాఖ మంత్రిని డబ్బు డిమాండ్ చేసిన ఘటన రాజకీయంగా సంచలనమైనది. జగ్తార్ సింగ్, ఉపకార్ సింగ్‌ అనే ఇద్దరు యువకులు ఓ టీవీ సీరియల్‌లో చూసిన సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఫేక్ ఫోన్ కాల్ డ్రామాకు ప్లాన్ రచించారు.

వీరిద్దరూ భారత్‌లో నిషేదానికి గురైన ఒపెరా బ్రౌజర్ యాప్ ద్వారా హర్యానా విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలకు ఫోన్ చేశారు. తాము అమిత్ షా నివాసం నుంచి మాట్లాడుతున్నామని, పార్టీ విరాళం కింద రూ.3 కోట్లు ఇవ్వాలని కోరారు. అయితే చౌతాలకు ఫోన్ కాల్‌పై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, ఢిల్లీ పోలీసులు నిందితులను హర్యానా భవన్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. ఇకపోతే ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు సిర్సాలో లెదర్ షాపు నిర్వహిస్తుండగా.. మరొకరు చండీఘడ్‌లో టాక్సీ నడుపుతున్నాడని తెలుస్తోంది.

అయితే మంత్రి రంజిత్ సింగ్ చౌతాల మాత్రం తనకు ఎటువంటి ఫేక్ కాల్ రాలేదని మీడియాకు చెప్పారు. “నా నుండి ఎవరూ డబ్బు డిమాండ్ చేయలేదు. నేను క్యాబినెట్ మంత్రిని, అలాంటిదేమీ నాకు జరగలేదు. పార్టీ ఫండ్స్ కోసం నన్ను సంప్రదించలేదు” అని ఆయన అన్నారు.

Latest Articles