అనంతపురంలో అసెంబ్లీని పెట్టాలిః వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి
మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో చెప్పిన దగ్గర నుంచి రాజకీయంగా ఎప్పుడూ ఏదొక చర్చకు దారి తీస్తూనే ఉంది. కొంతమంది ఈ విషయాన్ని ఆమోదిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. విపక్షాలన్నీ కూడా ఇది సరైన నిర్ణయం కాదని తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే.. రాజధానిని మార్చొద్దంటూ అమరావతి చుట్టు పక్కల గ్రామాల రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ అంశంపై తాజాగా సరికొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. అనంతపురం […]

మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో చెప్పిన దగ్గర నుంచి రాజకీయంగా ఎప్పుడూ ఏదొక చర్చకు దారి తీస్తూనే ఉంది. కొంతమంది ఈ విషయాన్ని ఆమోదిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. విపక్షాలన్నీ కూడా ఇది సరైన నిర్ణయం కాదని తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే.. రాజధానిని మార్చొద్దంటూ అమరావతి చుట్టు పక్కల గ్రామాల రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ అంశంపై తాజాగా సరికొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఓ నూతన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.
రాయలసీమకు ఒక్క హైకోర్టు సరిపోదని.. కర్నూలుకు హైకోర్టు ఇచ్చి.. అనంతపురంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని.. ఇందుకోసం అనంతపురంలోనూ అసెంబ్లీని నిర్మించాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఒక్క అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బదులు మూడు రాజధానుల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చని సిద్ధారెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలను కూడా జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.




