ఢిల్లీ తగలబడుతోంది. అమిత్‌షా ఎక్కడ.. బీజేపీపై శివసేన ఫైర్!
ఢిల్లీలో జరిగిన హింసాకాండలో ఇప్పటివరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్రం చోద్యం చేస్తోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే మండిపడ్డారు. ఓ వైపు ఢిల్లీ తగలబడుతుంటే హోంమంత్రి అమిత్ షా ఆచూకీ లేదని తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలను కలుసుకునే రహదారులపై అజిత్ దోవల్ కనిపించాడు. ఢిల్లీలో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగాయి. కానీ అమిత్ షా ఎక్కడున్నారో తెలియడం లేదు. దీని గురించి ఆయన ఏం […]
ఢిల్లీలో జరిగిన హింసాకాండలో ఇప్పటివరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్రం చోద్యం చేస్తోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే మండిపడ్డారు. ఓ వైపు ఢిల్లీ తగలబడుతుంటే హోంమంత్రి అమిత్ షా ఆచూకీ లేదని తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ప్రజలను కలుసుకునే రహదారులపై అజిత్ దోవల్ కనిపించాడు. ఢిల్లీలో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగాయి. కానీ అమిత్ షా ఎక్కడున్నారో తెలియడం లేదు. దీని గురించి ఆయన ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. కానీ ఢిల్లీ అగ్నిగుండంలా మారితే అమిత్ షా ఎక్కడున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజా సమూహాలతో మాట్లాడారు కూడా. మరి అమిత్ షా ఎక్కడా కనిపించలేదు. కానీ ఆయన ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం కనిపించారు’’ అని ఉద్దవ్ థాకరే అన్నారు.
హైపర్-నేషనలిజం, మతతత్వం దేశాన్ని 100 సంవత్సరాల వెనుకకు తీసుకువెళుతున్నాయని శివసేన పేర్కొంది. ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఇప్పటికి 39 మంది మరణించారు. 45 మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఈ అల్లర్లపై నమోదైన వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌ను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా, ఢిల్లీలో గడిచిన 36 గంటలుగా ఎలాంటి చేదు సంఘటనలు నమోదు కాలేదని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.