ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి, పోలీసుల సహకారంతోనేనా ?

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై గురువారం బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ పని ఆ పార్టీ గూండాలదే అని ఆప్ ఆరోపించింది. సిసోడియా కుటుంబ సభ్యుల భద్రతకు ఉద్దేశించిన పోలీసుల సహకారంతోనే..

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి, పోలీసుల సహకారంతోనేనా ?

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై గురువారం బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ పని ఆ పార్టీ గూండాలదే అని ఆప్ ఆరోపించింది. సిసోడియా కుటుంబ సభ్యుల భద్రతకు ఉద్దేశించిన పోలీసుల సహకారంతోనే వారీ ఎటాక్ కు పాల్పడ్డారని పేర్కొంది. సిసోడియా ఇంట్లోలేని సమయంలో ఈ ఘటన జరిగింది. ఆప్ నేతలు రాఘవ్ చద్దా, అతిషి ఈ వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. కొద్ధి సంఖ్యలో ఉన్న పోలీసులను కూడా తోసుకుంటూ బీజేపీ కార్యకర్తలు సిసోడియా ఇంటిలోకి దూసుకురావడం ఈ వీడియోలో కనిపించింది. వీరిలో ఒకరి చేతిలో అసాల్ట్ రైఫిల్ కూడా ఉన్నట్టు కనిపించిందని రాఘవ్ చద్దా అన్నారు. ఈ గుంపును అడ్డగించడానికి పోలీసులు చేసిన యత్నం ఫలించలేదు. తన నివాసంపై జరిగిన దాడి గురించి తెలుసుకున్న సిసోడియా.. ఇదంతా ఓ  పథకం ప్రకారం జరిగిందని ఆరోపించారు. నేను ఇంట్లో లేనప్పుడు బీజేపీ గూండాలు నా ఇంట్లోకి చొరబడి నా భార్యా పిల్లలపై దాడికి యత్నించారని ఆయన ట్వీట్ చేశారు. అటు- హోం మంత్రి అమిత్ షా సూచనపై ఈ దాడి జరిగిందని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.  సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఎటాక్ ను తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటనకు అమిత్ షాయే బాధ్యులని ఆరోపించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu