ఉప్పొంగుతున్న గోదావరి.. గ్రామాల్లోకి జింకలు

గోదావరి వరదల కారణంగా కోనసీమలో పలు లంకల్లోని ఇళ్లలోకి జింకలు వస్తున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంకల్లో చోటు లేక జింకలు జనావాసాల్లోకి వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం...

ఉప్పొంగుతున్న గోదావరి.. గ్రామాల్లోకి జింకలు
Follow us

|

Updated on: Aug 18, 2020 | 8:45 PM

గోదావరి జిల్లాలు వరద నీటిలోనే ఉన్నాయి. వరద నీటి నుంచి బయట పడేందుకు మరో నాలుగు రోజుల పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని 60 గ్రామాలు నీట మునగడంతో.. ఆయా గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే కొన్ని గ్రామాల్లో పశువులు అక్కడే ఉండిపోయాయి. ఇదిలావుంటే అడవి ప్రాంతాల్లో ఉండే వణ్య ప్రాణాలు గ్రామాల్లోకి వస్తున్నాయి.

గోదావరి వరదల కారణంగా కోనసీమలో పలు లంకల్లోని ఇళ్లలోకి జింకలు వస్తున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంకల్లో చోటు లేక జింకలు జనావాసాల్లోకి వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం సమీపంలో ఉన్న నారాయణ లంకలో జింకలు ఎక్కువగా ఆవాసం పొందుతుంటాయి.

అయితే గత వారం రోజులుగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంకల్లో ఎక్కడా వాటికి చోటు దొరకక గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మంగళవారం నాడు గోదావరి లంకలో నుండి కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోకి రెండు జింకలు రావడంతో సందడిగా మారింది.