చపక్‌ ట్రైలర్: యాసిడ్ బాధితురాలిగా దీపికా.. చేధుగా నిజ జీవిత కథ..!

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా.. వస్తోన్న తాజా సినిమా  ‘చపక్’. ఈ చిత్రంను దీపికా.. తన సొంత ప్రొడక్షన్‌లో నిర్మిస్తుండగా.. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఢిల్లీలో 2005లో లక్ష్మీ అగర్వాల్ అనే అమ్మాయిపై బస్టాప్‌లో అందరూ చూస్తుండగానే’.. యాసిడ్‌తో దాడి చేశారు. ప్రేమించలేదనే కారణంతో.. ఆమెపై యాసిడ్‌ దాడి జరిగింది. ఈమె జీవితాధారంగానే చపాక్ చిత్రం వస్తోంది.  కాగా.. చపాక్‌లో లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక కనిపించబోతోంది.  తాజాగా.. ఈ సినిమా ట్రైలర్  విడుదల […]

చపక్‌ ట్రైలర్: యాసిడ్ బాధితురాలిగా దీపికా.. చేధుగా నిజ జీవిత కథ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 10, 2019 | 8:23 PM

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా.. వస్తోన్న తాజా సినిమా  ‘చపక్’. ఈ చిత్రంను దీపికా.. తన సొంత ప్రొడక్షన్‌లో నిర్మిస్తుండగా.. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఢిల్లీలో 2005లో లక్ష్మీ అగర్వాల్ అనే అమ్మాయిపై బస్టాప్‌లో అందరూ చూస్తుండగానే’.. యాసిడ్‌తో దాడి చేశారు. ప్రేమించలేదనే కారణంతో.. ఆమెపై యాసిడ్‌ దాడి జరిగింది. ఈమె జీవితాధారంగానే చపాక్ చిత్రం వస్తోంది.  కాగా.. చపాక్‌లో లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక కనిపించబోతోంది.  తాజాగా.. ఈ సినిమా ట్రైలర్  విడుదల అయ్యింది.

ట్రైలర్ టాక్: ట్రైలర్‌ చూస్తున్నంత సేపూ.. హృదయం ద్రవించిపోతోంది. తనపై దాడి చేసిన నిందితులను ఆమె ఎలా ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమెకు ఎవరు ఎలా సహాయమందించారు అనేది ట్రైలర్‌లో చూపించారు. అలాగే.. అలసిపోకుండా.. పోరాడుతూ ఉంటే.. విజయం తప్పక లభిస్తుందన్నది కూడా ఈ సినిమా మొక్క ముఖ్య ఉద్ధేశం. అందులోనూ యాసిడ్ చట్టం ఉల్లంఘన గురించి, ఆ చట్టం యొక్క నిబంధనలు ఎలా అమలు చేశారు అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. కాగా.. ఈ ఘటనతో లక్ష్మీ అగర్వాల్ ఎంత బాధపడింది.. ఎన్ని సమస్యలు ఎదుర్కొంది అనేది చక్కగా చూపించారు. కాగా.. ఇక ఈ పాత్రలో ప్రియాంక జీవించిందనే చెప్పాలి.

అంతేకాకుండా.. ఈ ట్రైలర్‌లో ప్రముఖ నటుడు విక్రాంత్ కూడా ముఖ్యమైన రోల్లో నటించాడు. బాధితురాలికి సహాయం అందించే ఓ ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. అలాగే.. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందనేది కూడా ట్రైలర్‌లో చూపించారు. దేశంలో స్ట్రీలపై జరుగుతోన్న దాడులను ప్రతిబింబిచేలా ఈ సినిమా ఉండబోతోంది. కాగా.. ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.