ఎలుక చచ్చిన భోజనం తినాలా.? యూపీలో ఘోరం!
మధ్యాహ్న భోజన పథకం మరోసారి వివాదం అయింది. వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు ఆహార పంపిణీ అందిస్తున్నామని ప్రభుత్వాలు అంటుంటే.. వారికి మాత్రం అందేది శూన్యం. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్‌లో లీటర్ పాలల్లో బకెట్ నీళ్లు కలిపి 81 మంది విద్యార్థులకు ఇచ్చిన ఘటన మరువక ముందే.. ఆ రాష్ట్రంలోనే మరో ఉదంతం చోటు చేసుకుంది. విద్యార్థులకు పోషకాహారం అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని ఓ […]
మధ్యాహ్న భోజన పథకం మరోసారి వివాదం అయింది. వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు ఆహార పంపిణీ అందిస్తున్నామని ప్రభుత్వాలు అంటుంటే.. వారికి మాత్రం అందేది శూన్యం. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్‌లో లీటర్ పాలల్లో బకెట్ నీళ్లు కలిపి 81 మంది విద్యార్థులకు ఇచ్చిన ఘటన మరువక ముందే.. ఆ రాష్ట్రంలోనే మరో ఉదంతం చోటు చేసుకుంది. విద్యార్థులకు పోషకాహారం అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెట్టే భోజనంలో ఎలుక రావడంతో.. ఆ ఆహారం తిని 9 మంది విద్యార్థులు, ఓ టీచర్ అస్వస్థతకు గురయ్యారు.
మంగళవారం ఆరు, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా భోజనం వడ్ఢించారు. ఇక భోజనం తిన్న కాసేపటికే స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. ఇదంతా ఎందుకు జరిగిందని పరిశీలించగా.. భోజనం పాత్రలో ఎలుక చనిపోయి ఉండటం గమనించారు. ఇక విద్యార్థులను, టీచర్‌ను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, ఈ ఘటనతో యోగి సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.