యాదాద్రి వివాదం: విగ్రహాన్ని మార్చలేదు..కానీ..!

యాదాద్రి వివాదం: విగ్రహాన్ని మార్చలేదు..కానీ..!

యాదాద్రి టెంపుల్ వివాదం కొత్త మలుపు తిరిగింది. మూల విరాట్ విగ్రహంలో మార్పులు చేశారంటూ వచ్చిన కథనాలపై ప్రధాన అర్చకులు నరసింహాచార్యలు క్లారిఫికేషన్ ఇచ్చారు. మూల విరాట్‌లో ఎలాంటి మార్పులు జరగలేదని, సింధూరం మాత్రమే తొలగించామని చెప్పుకొచ్చారు నరసింహాచార్యులు. సింధూరం తొలగించడం సహజమైన ప్రక్రియ అని ఆయనన్నారు. అన్ని ఆలయాల్లో మాదిరిగానే ఇక్కడా చేశామని ప్రధాన అర్చకులు తెలిపారు. నిష్టా గరిష్టులైన ఉపాసకులచే సింధూరం తొలగించామని, స్వామివారి నిజరూపంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని కుండ బద్దలు […]

Rajesh Sharma

|

Dec 04, 2019 | 1:34 PM

యాదాద్రి టెంపుల్ వివాదం కొత్త మలుపు తిరిగింది. మూల విరాట్ విగ్రహంలో మార్పులు చేశారంటూ వచ్చిన కథనాలపై ప్రధాన అర్చకులు నరసింహాచార్యలు క్లారిఫికేషన్ ఇచ్చారు. మూల విరాట్‌లో ఎలాంటి మార్పులు జరగలేదని, సింధూరం మాత్రమే తొలగించామని చెప్పుకొచ్చారు నరసింహాచార్యులు. సింధూరం తొలగించడం సహజమైన ప్రక్రియ అని ఆయనన్నారు. అన్ని ఆలయాల్లో మాదిరిగానే ఇక్కడా చేశామని ప్రధాన అర్చకులు తెలిపారు. నిష్టా గరిష్టులైన ఉపాసకులచే సింధూరం తొలగించామని, స్వామివారి నిజరూపంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని కుండ బద్దలు కొట్టారు ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు.

కెసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆలయాన్ని పూర్తిగా పున:నిర్మించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మకుటంగా రూపొందించాలని నిర్ణయించారు. చినజీయర్ స్వామి వారి ఆశీస్సులతో యాదాద్రి ఆలయ పున:నిర్మాణ క్రతువును ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. పున:నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని స్వయంభూ: విగ్రహానికి మార్పులు చేశారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. నిజానికి ఆ కథనాల్లో ఇచ్చిన వివరణలోనే ప్రధాన అర్చకులు పూర్తి క్లారిటీ ఇచ్చారు. కాగా, ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశం కావడంతో ప్రధాన అర్చకులు మరోసారి క్లారిటీ ఇచ్చారు. మూల విరాట్ స్వరూపాన్ని అలాగే వుంచామని, సింధూరం తొలగింపుతో స్వామి వారి మీసాలు మాత్రం గోచరిస్తున్నాయని ఆయన వివరించారు. అయితే యాదాద్రి స్వామి వారు శాంత మూర్తా ? లేక ఉగ్రస్వరూపామా? అన్న అంశంపై క్లారిటీ ఇవ్వలేదు ప్రధాన అర్చకులు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu