AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అశ్రునయనాలతో కన్నతండ్రికి కడసారి సెల్యూట్‌

ఉత్తరాఖండ్: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పార్థివ దేహాలు స్వస్థలానికి చేరుకుంటున్నాయి. ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు యావత్‌ దేశం కన్నీటి వీడ్కోలు పలుకుతోంది. కుటుంబసభ్యులు, బంధువుల అశ్రు నయనాల మధ్య అమర జవాన్లకు వారి వారి స్వస్థలాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. డెహ్రాడూన్‌కు చేరుకున్న సీఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ మోహన్‌లాల్‌ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మృతదేహానికి మోహన్‌లాల్‌ కుమార్తె కడసారిగా సెల్యూట్‌ చేసింది. కన్నీటిని […]

అశ్రునయనాలతో కన్నతండ్రికి  కడసారి సెల్యూట్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:48 PM

Share

ఉత్తరాఖండ్: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పార్థివ దేహాలు స్వస్థలానికి చేరుకుంటున్నాయి. ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు యావత్‌ దేశం కన్నీటి వీడ్కోలు పలుకుతోంది. కుటుంబసభ్యులు, బంధువుల అశ్రు నయనాల మధ్య అమర జవాన్లకు వారి వారి స్వస్థలాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. డెహ్రాడూన్‌కు చేరుకున్న సీఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ మోహన్‌లాల్‌ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మృతదేహానికి మోహన్‌లాల్‌ కుమార్తె కడసారిగా సెల్యూట్‌ చేసింది. కన్నీటిని దిగమింగుకుని ఆమె సెల్యూట్‌ చేసిన తీరును అక్కడివారిని కలిచివేసింది. ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల నేతలు మోహన్‌లాల్‌కు ఘన నివాళులర్పించారు.

Follow Us