తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు

ఇంటి పెద్దను కోల్పోవడంతో ఓ కుటుంబ పరిస్థితి రోడ్డు పాలైంది. మగ పిల్లలు లేని ఆ ఇంట్లో కన్నతండ్రికి కూతురే అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచింది.

తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు

ఇంటి పెద్దను కోల్పోవడంతో ఓ కుటుంబ పరిస్థితి రోడ్డు పాలైంది. మగ పిల్లలు లేని ఆ ఇంట్లో కన్నతండ్రికి కూతురే అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచింది. అతడు నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్‌. రోజూ కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది. భార్య, కూతురితో ఉన్నంతలో బతుకు బండిని నడిపిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగి గుండెపోటుతో అతడు చనిపోయాడు. కుమారులు లేకపోవడంతో ఒక్కగానొక్క కూతురు తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది.

నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌కు చెందిన ఈదిదర్‌ అంబాదాస్‌ అలియాస్‌ అరుణ్‌(30) స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున అతడు గుండెపోటుతో మృతి చెందాడు. కుమారులు లేకపోవడంతో.. ఒక్కగానొక్క కుమార్తె వైష్ణవి నాన్నకు అంత్యక్రియలు నిర్వహించింది. ఈ దృశ్యం గ్రామస్థుల హృదయాలను కలచి వేసింది. కాగా, మృతుడి కుటుంబానికి పలువురుఆర్థిక సహాయం అందజేసి అంత్యక్రియలు నిర్వహించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu