AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రరాజ్యంలో కరోనా ఏ దశలో ఉందంటే..

అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొత్త దశకు చేరుకుందని, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. అసాధారణంగా విస్తరిస్తోందని వైట్‌హౌస్‌ ఆరోగ్య నిపుణులు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు పెరుగుతున్న కేసులు మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయని, వాటిని అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు.

అగ్రరాజ్యంలో కరోనా ఏ దశలో ఉందంటే..
Balaraju Goud
|

Updated on: Aug 04, 2020 | 3:05 AM

Share

అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొత్త దశకు చేరుకుందని, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. అసాధారణంగా విస్తరిస్తోందని వైట్‌హౌస్‌ ఆరోగ్య నిపుణులు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు పెరుగుతున్న కేసులు మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయని, వాటిని అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు.

అమెరికాలో అంతకంతకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. కొవిడ్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అగ్రరాజ్యంలో పరిపాటిగా మారింది. తాజాగా నమోదవుతున్న గణాంకాలను పరిశీలిస్తే.. మార్చి, ఏప్రిల్‌ నాటి పరిస్థితులకు ఇప్పటికి పూర్తి భిన్నమైన స్థితి నెలకొంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వైరస్‌ అసాధారణంగా విస్తరిస్తోంది’ అని వైట్‌హౌస్‌ టాస్క్‌ఫోర్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ డెబోరా బ్రిక్స్‌ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని, లేకుంటే ఈ కరోనా వైరస్‌ నుంచి కాపాడుకోలేరని చెప్పారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

ఇక, అమెరికాలో గత 24 గంటల్లో 49,038 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు 46 లక్షల మందికిపైగా కరోనా వైరస్‌ సోకగా.. 1.55 లక్షల మందికిపైగా కరోనాను జయించలేక ప్రాణాలొదిలారు. ప్రపంచవ్యాప్తంగానూ వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండటం మాత్రమే ప్రస్తుత తరుణంలో కరోనా కట్టడి సాధ్యమని వైట్‌హౌస్‌ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us
మెగాస్టార్‌కు పడాల్సిన బ్లాక్ బస్టర్.. కానీ మిస్ అయ్యి
మెగాస్టార్‌కు పడాల్సిన బ్లాక్ బస్టర్.. కానీ మిస్ అయ్యి
అద్దె ఇంట్లో వాస్తు దోషం ఉందా? సింపుల్ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ
అద్దె ఇంట్లో వాస్తు దోషం ఉందా? సింపుల్ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ
నిటారుగా ఉన్న కొండలను సైతం అవలీలగా ఎక్కుతుంది
నిటారుగా ఉన్న కొండలను సైతం అవలీలగా ఎక్కుతుంది
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్
ఫేస్ బుక్ లవర్ కోసం శ్రీలంక వెళ్లిన 17 ఏళ్ల కుర్రాడు అరెస్ట్
ఫేస్ బుక్ లవర్ కోసం శ్రీలంక వెళ్లిన 17 ఏళ్ల కుర్రాడు అరెస్ట్
గ్రహాల మాయాజాలం.. ఈ రాశులకు మూడు నెలల పాటు డబ్బే డబ్బు..!
గ్రహాల మాయాజాలం.. ఈ రాశులకు మూడు నెలల పాటు డబ్బే డబ్బు..!
ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వింత బావి..
ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వింత బావి..
శుక్ర యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారు మట్టిని ముట్టినా బంగారమే
శుక్ర యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారు మట్టిని ముట్టినా బంగారమే
పిల్లల లంచ్ బాక్స్‌లోకి అదిరిపోయే రిసిపీ.. ఈ రైస్‌తో కొండంత బలం
పిల్లల లంచ్ బాక్స్‌లోకి అదిరిపోయే రిసిపీ.. ఈ రైస్‌తో కొండంత బలం
ప్రాణం తీసే కొండచిలువకే ప్రాణం పోశాడు.. ఈ వీడియో చూస్తే..
ప్రాణం తీసే కొండచిలువకే ప్రాణం పోశాడు.. ఈ వీడియో చూస్తే..