“కంప్యూటర్ మౌస్” సృష్టికర్త ఇక లేరు

ఓ కంప్యూటర్ దిగ్గజం ఇక లేరు. కంప్యూటర్ మౌస్ సృష్టికర్తల్లో ఒకరైన అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ విలియమ్ బిల్ ఇంగ్లీష్ మరణించారు. 91 ఏళ్ల వయసున్న ఆయన కాలిఫోర్నియాలో మృతిచెందారు. అయితే బయటి ప్రపంచానికి ఆ విషయం ఆలస్యంగా తెలిసింది. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నేవీలో కెరీర్ ప్రారంభించిన విలియమ్.. రిటైర్‌మెంట్ తర్వాత ఎస్‌ఆర్‌ఐ (శ్రీ) ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడే కంప్యూటర్‌కు […]

కంప్యూటర్ మౌస్ సృష్టికర్త ఇక లేరు

ఓ కంప్యూటర్ దిగ్గజం ఇక లేరు. కంప్యూటర్ మౌస్ సృష్టికర్తల్లో ఒకరైన అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ విలియమ్ బిల్ ఇంగ్లీష్ మరణించారు. 91 ఏళ్ల వయసున్న ఆయన కాలిఫోర్నియాలో మృతిచెందారు. అయితే బయటి ప్రపంచానికి ఆ విషయం ఆలస్యంగా తెలిసింది. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

నేవీలో కెరీర్ ప్రారంభించిన విలియమ్.. రిటైర్‌మెంట్ తర్వాత ఎస్‌ఆర్‌ఐ (శ్రీ) ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడే కంప్యూటర్‌కు మౌస్ సృష్టించాలన్న డోగ్లస్ ఎంగెల్‌బార్ట్ ఆలోచనపై పనిచేశారు. దీనికోస తీవ్రంగా శ్రమించిన వారిలో విలియం కూడా ఒకరు.

Click on your DTH Provider to Add TV9 Telugu