నటరత్న విశ్వనాథశాస్త్రి కన్నుమూత
ప్రముఖ విద్వాంసుడు.. నాటక, సాహిత్యవేత్త బ్రహ్మశ్రీ రొట్టె విశ్వనాథశాస్త్రి సోమవారం కన్నుమూశారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన విశ్వనాథశాస్త్రి కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన అయన సోమవారం తుదిశ్వాస విడిచారు. వయస్సు 85 సంవత్సరాలు.
ప్రముఖ విద్వాంసుడు.. నాటక, సాహిత్యవేత్త బ్రహ్మశ్రీ రొట్టె విశ్వనాథశాస్త్రి సోమవారం కన్నుమూశారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన విశ్వనాథశాస్త్రి కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన అయన సోమవారం తుదిశ్వాస విడిచారు. వయస్సు 85 సంవత్సరాలు. దృశ్యకావ్య పరంపరకు మెరుగులు దిద్ది, సంప్రదాయ నాటకరంగానికి వెలుగుబాట చూపిన వైతాళికుడు విశ్వనాథశాస్త్రి. రంగస్థల నటుడిగా, ప్రయోక్తగా, దర్శకుడిగా, రచయితగా, కవిగా ఆయన సుప్రసిద్ధుడు. ధర్మపురిలో లక్ష్మీ నరసింహ నాట్యమండలి వ్యవస్థాపకుల్లో ఒకరుగా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. వివిధ రంగాలకు విశేష కృషి చేసిన ఆయన 1959లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చేతులమీదుగా నటరత్న బిరుదును పొందారు. శృంగేరీ పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారి చేతులమీదుగా ఉత్తమ పౌరాణికులుగా అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయస్థాయిలో అనేక సన్మానాలు, బిరుదులను విశ్వనాథశాస్త్రి స్వీకరించారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.