కొడుకు చంపిన ఇద్దరు సోదరులను హత్య చేయించిన తల్లి..!

నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. పాత కక్షలకు అన్నదమ్ములిద్దరు బలయ్యారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లలతో నరికి దారుణంగా హతమార్చారు.

కొడుకు చంపిన ఇద్దరు సోదరులను హత్య చేయించిన తల్లి..!

నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. పాత కక్షలకు అన్నదమ్ములిద్దరు బలయ్యారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లలతో నరికి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం హజారిగూడెంలో చోటుచేసుకుంది. హజారిగూడేనికి చెందిన జానపాటి ఇస్తారి, రాములమ్మ దంపతులకు కూతురు పార్వతమ్మ, ముగ్గు రు కుమారులు సత్యనారాయణ, హరి, ఆంజనేయులు ఉన్నారు. వీరందరికీ వివాహాలు కావడంతో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు.

ఇదిలావుంటే హరి భార్యతో హాలియాకు చెందిన రేవంత్‌ అనే వ్యక్తి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రేవంత్‌ను హరి మందలించాడు. వారి తల్లిదండ్రులకు సైతం ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా గతేడాది పోలీసు స్టేషన్‌ను కూడా ఆశ్రయించాడు. రేవంత్‌కు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన హరి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కిరాయి హంతకులతో రేవంత్‌ను హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు గా ఉన్న హరి, ఆంజనేయులతో సహా మరికొందరు నల్లగొండ జైలులో వెళ్లారు. కాగా, హరి, ఆంజనేయులు ఇటీవలే బెయిల్‌పై విడుదలై సొంతూరుకు చేరుకున్నారు.

బెయిల్‌పై వచ్చిన హరి, ఆంజనేయులును అంతమొందించాలనే ప్రతీకారం తో రేవంత్‌ తల్లి ఇందిర ఇన్నాళ్లు వేచి చూసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు పక్కా ప్రణాళికతో ఇద్దరు సోదరులను హత్య చేయాలని ఫ్లాన్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సత్యనారాయణ హజారిగూడెంలోని తన ఇంటిముందు నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో అతడిపై దాడి చేశారు. సత్యనారాయణ అరుపులు విన్న బయటకు వచ్చిన అతని తమ్ముడు ఆంజనేయులును సైతం దుండగులు దాడి చేశారు. అన్నదమ్ములిద్దరు సత్యనారాయణ, ఆంజనేయులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రేవంత్‌ హత్యకు ఇది ప్రతీకార ఘటనగా ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్సై శివకుమార్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Click on your DTH Provider to Add TV9 Telugu