20 రోజుల తర్వాత ముంబై వీధుల్లో నేను..

కరోనా నుంచి బాలీవుడ్ బ్యూటీ.. మ‌లైకా అరోరా కోలుకున్నారు. కోలుకున్న వెంటనే ముంబై వీధుల్లో సందడి చేస్తున్నారు. ఈ విషయాన్ని తనఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. చాలా రోజుల త‌ర్వాత నా గ‌ది నుండి బ‌య‌టికొచ్చానంటూ పోస్ట్‌లో...

  • Sanjay Kasula
  • Publish Date - 3:54 pm, Mon, 28 September 20
20 రోజుల తర్వాత ముంబై వీధుల్లో నేను..

కరోనా నుంచి బాలీవుడ్ బ్యూటీ.. మ‌లైకా అరోరా కోలుకున్నారు. కోలుకున్న వెంటనే ముంబై వీధుల్లో సందడి చేస్తున్నారు. ఈ విషయాన్ని తనఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. చాలా రోజుల త‌ర్వాత నా గ‌ది నుండి బ‌య‌టికొచ్చానంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. కోవిడ్ నేప‌థ్యంలో ఇంటికే ప‌రిమిత‌మైన మ‌లైకా చాలా రోజుల త‌ర్వాత అరోరా తన సోద‌రి అమృతా అరోరా ఇంటికి వెళ్లారు.

లియోపార్డ్ ప్రింట్ టాప్ గ్రే ప్యాంట్ కాస్ట్యూమ్స్ విత్ ఫేస్ మాస్క్ తో కరోనా నిబంధ‌న‌లు పాటించారు. వెహికిల్ సింగిల్ గా వెళ్తున్న ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. క‌రోనాను జ‌యించిన తర్వాత తన ఫ్యాన్స్‌తో చాలా విషయాలను పంచుకున్నారు.

 

View this post on Instagram

 

Twos company ♥️ #sundaze#kaftankove#casperlove❤️

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

అంతే కాదు క‌రోనా నుంచి కోలుకునేందుకు స‌హ‌క‌రించిన బీఎంసీ అధికారులు, వైద్య‌స‌లహాలు, సూచ‌న‌లు అందించిన డాక్ట‌ర్ల‌కు, మ‌ద్ద‌తుగా నిలిచిన కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల‌కు కృత‌జ్ఞ‌త‌లు త‌న మెసెజ్‌లో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ద‌య‌చేసి మీరంతా జాగ్ర‌త్త‌లు తీసుకోండి.. సుర‌క్షితంగా ఉండండి అని మ‌లైకా అరోరా మెసేజ్ పోస్ట్ లో తన ఫ్యాన్స్‌కు సూచించారు.