5

‘డార్లింగ్’తో ఛార్మీ ‘బేబీ బాయ్’ ! వావ్ ! కంపల్సరీగా లుక్కు వేయాల్సిందే !

సినీ నటి, ప్రొడ్యూసర్ కూడా అయిన ఛార్మీ కౌర్ తాజాగా తన  ఇన్స్ టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో చూస్తే 'వావ్' అనాల్సిందే !

'డార్లింగ్'తో ఛార్మీ 'బేబీ బాయ్' ! వావ్ ! కంపల్సరీగా లుక్కు వేయాల్సిందే !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 11, 2020 | 10:46 AM

సినీ నటి, ప్రొడ్యూసర్ కూడా అయిన ఛార్మీ కౌర్ తాజాగా తన  ఇన్స్ టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో చూస్తే ‘వావ్’ అనాల్సిందే ! ..తన ‘అందాల’ పెంపుడు కుక్క ‘బేబీ బాయ్’ తో సోఫాపై డార్లింగ్ ప్రభాస్ రారాజులా కూర్చున్న ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. 9 నెలల వయసున్న ఈ శునకం అలాంటిది, ఇలాంటిది కాదు, అమెరికాలోని అలాస్కా నుంచి తెప్పించిన అరుదైన ‘మాలమ్యూట్ ‘ జాతి జాగిలమిది ! ‘డార్లింగ్ విత్ మై 9 మంత్స్ ఓల్డ్ బేబీ బాయ్’ అని ఛార్మీ కామెంట్ చేసింది. అసలే ‘బాహుబలి’ ! ఆయనకు తోడు ఈ బ్యూటిఫుల్ శునకం కూడా ! ఇలాంటి రేర్ ఫోటోను తమకు అందజేసినందుకు ఛార్మీ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లకు ఫ్యాన్స్ అదేపనిగా కృతజ్ఞతలు చెబుతున్నారు.

2005 లో ‘చక్రం’, 2006 లో ‘పొర్ణమి’ మూవీల్లో ప్రభాస్, ఛార్మీ కలిసి నటించగా.. పూరీ దర్శకత్వంలో ప్రభాస్ 2009 లో ‘ఏక్ నిరంజన్’, ‘ బుజ్జిగాడు’ చిత్రాల్లో నటించాడు.