AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగల అద్భుత శక్తి కాకులది!- తాజా అధ్యయనం

కాకులకు మేధస్సు ఎక్కువని మనందరికీ తెలుసు. అయితే, ఇవి మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగలవని తాజా శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది. జర్మనీలోని టూబింగెన్ యూనివర్సిటీ పరిశోధకులు కార్రియన్ కాకులపై జరిపిన ఈ అధ్యయనం ప్రకారం, కాకులు దృశ్య సంకేతాలను కేవలం సగటున 235 మిలిసెకన్లలోనే అర్థం చేసుకుని, ఎలాంటి తప్పులు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోగలవని తేలింది.

మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగల అద్భుత శక్తి కాకులది!- తాజా అధ్యయనం
Crow Intelligence
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2026 | 6:15 PM

Share

సాధారణంగా కాకులను చాలా చురుకైన, తెలివైన పక్షులుగా భావిస్తాము. అయితే, కాకుల మేధస్సుకు సంబంధించి శాస్త్రవేత్తలు తాజాగా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. మనుషులతో పోలిస్తే కాకులు రెట్టింపు వేగంతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలవని ఒక తాజా పరిశోధనలో తేలింది. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ టూబింగెన్ కు చెందిన నూరోబయాలజిస్టులు ఫిలిప్ ష్మిద్‌బౌయర్, ఆండ్రియాస్ నీడర్‌ ఈ పరిశోధనను నిర్వహించారు. ఈ వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

అధ్యయనం ఎలా జరిగింది?

పక్షుల మెదడు సామర్థ్యాన్ని పరీక్షించడానికి పరిశోధకులు కార్రియన్ క్రోస్ అనే కాకుల జాతిని ఎంచుకున్నారు. ఆ కాకులకు టచ్‌స్క్రీన్‌పై కదులుతున్న చుక్కలను గమనించి, అవి ఏ దిశగా కదులుతున్నాయో గుర్తించేలా శిక్షణ ఇచ్చారు. కాకులు సరైన దిశను ఎంచుకున్న ప్రతిసారీ వాటికి ఆహారంగా పురుగులను బహుమతిగా ఇచ్చేవారు.

ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి:

అతి తక్కువ సమయంలోనే నిర్ణయం: కాకులు దృశ్య సంకేతాలను విశ్లేషించి కేవలం సగటున 235 మిలిసెకన్లలోనే అంటే.. సెకన్లలో నాల్గవ వంతు భాగంలోనే నిర్ణయాలు తీసుకోగలిగాయి. ఇది మనుషులు, కోతులతో పోలిస్తే చాలా వేగవంతమైనది.

ఇవి కూడా చదవండి

ఖచ్చితత్వంలో రాజీ లేదు: వేగంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, కాకుల సమాధానాల ఖచ్చితత్వం అత్యంత అద్భుతంగా ఉంది. గందరగోళ పరిస్థితుల్లో కూడా అవి రాండమ్‌గా కాకుండా ఆలోచించి సరైన ఎంపికలు చేశాయి.

కాకులకు ఈ వేగం ఎందుకు వచ్చింది?

పక్షులు ఆకాశంలో వేగంగా ఎగిరేటప్పుడు చెట్లను, ఇతర అడ్డంకులను తప్పించుకుంటూ సురక్షితంగా ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే నేలపై ఆహారాన్ని లేదా ప్రమాదాలను క్షణాల్లో గుర్తించాలి. ఈ పరిణామ క్రమ ఒత్తిడి వల్లే కాకుల మెదడులో విజువల్ సిగ్నల్స్‌ను ప్రాసెస్ చేసే న్యూరాన్లు అత్యంత వేగంగా పనిచేసేలా రూపాంతరం చెందాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పక్షుల మెదడును తక్కువగా అంచనా వేసే రోజులు పోయాయి. క్షణాల వ్యవధిలో మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకునే కాకుల అద్భుతమైన మేధస్సు ప్రకృతిలో వాటి ప్రత్యేకతను చాటుతోంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్.. 5 నిమిషాల్లో లంచ్ బాక్స్‌ రెడీ
మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్.. 5 నిమిషాల్లో లంచ్ బాక్స్‌ రెడీ
ఏపీలో మున్సిపల్ పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక ప్రకటన..!
ఏపీలో మున్సిపల్ పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక ప్రకటన..!
మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగలవి కాకులు!
మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగలవి కాకులు!
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!