గో మహా పాదయాత్ర సన్నాహక సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు యుగ తులసి ఫాండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్. గణపతి శ్లోకంతో హైదరాబాద్‌లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోమాతని సంరక్షించుకునే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు శివకుమార్. గోమాతని జాతీయప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 5 నుంచి 7 వరకు గో మహా పాదయాత్ర జరగబోతోంది.. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు 3 రోజులు జరిగే పాదయాత్రను విజయవంత చేయాలని శివకుమార్ పిలుపునిచ్చారు. లక్ష గోవులతో గోశాల పెట్టాలన్నది తన లక్ష్యమన్నారు. లక్ష గోవుల సంరక్షణకు సరిపడా స్థలాన్ని కేటాయించాలని.. తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆవులు అంతరించిపోకముందే వాటిని మనమే రక్షించుకోవాలని శివకుమార్ పిలుపునిచ్చారు. హిందూ బంధువులంతా గోమాతని కాపాడుకోవాలన్నారు. గోమాత ప్రసాదించే ఉత్పత్తులను వాడుకోవాలేగానీ.. వాటిని సంహరిస్తే మాత్రం సహించబోమన్నారు.