కరోనా: ప్రతీ 15 మందిలో ఒకరికి కరోనా వచ్చి..పోయింది!

|

Sep 30, 2020 | 1:15 PM

దేశంలోని కరోనా వైరస్ తీవ్రతపై ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తాజాగా చేసిన సీరో సర్వేలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి...

కరోనా: ప్రతీ 15 మందిలో ఒకరికి కరోనా వచ్చి..పోయింది!
Follow us on

Covid-19: దేశంలోని కరోనా వైరస్ తీవ్రతపై ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తాజాగా చేసిన సీరో సర్వేలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. దేశంలోని 700 గ్రామాలతో పాటు 70 జిల్లాల్లో చేపట్టిన సర్వే ప్రకారం 10 ఏళ్లు పైబడిన వారిలో 6.6% మందికి.. 18 ఏళ్లు అంతకంటే పైబడిన వయసు వారిలో 7.1 శాతం మందిలో కరోనా యాంటీ బాడీస్ కనిపించాయని తేలింది. అలాగే దేశంలో ఆగష్టు నాటికి దాదాపు 20 కోట్ల మందికి కరోనా వచ్చి.. పోయిందని ఐసీఎం నిర్వహించిన సీరో సర్వేలో తేలింది. ఈ రెండో సీరో సర్వేను ఐసీఎంఆర్ ఆగష్టు 17 నుంచి సెప్టెంబర్ 22 మధ్య నిర్వహించింది.

పట్టణాల్లోని మురికివాడల్లో 15.6 శాతం మంది కరోనా వచ్చిపోయిందని.. అలాగే నగరాల్లో 8.2 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.4 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని పేర్కొంది. ఆగష్టు చివరి నాటికి ప్రతీ 15 మందిలో ఒకరికి(10 ఏళ్లు, ఆపైబడిన వారిలో) కరోనా సోకినట్లు సీరో సర్వేలో వెల్లడైంది. మురికివాడల కంటే పట్టణ స్లమ్‌ ఏరియాల్లో 2 రెట్లు, గ్రామీణ ప్రాంతాలలో 4 రెట్లు రిస్క్ ఉందని నివేదిక పేర్కొంది.  కాగా, ఇప్పటివరకు దేశంలో 51 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.

Also Read:

మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!

ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం ధర..