కరోనా క‌మ్మేసింది.. భారత్‌లో 40కోట్ల మంది పేదరికంలోకి

కరోనా క‌మ్మేసింది.. భారత్‌లో 40కోట్ల మంది పేదరికంలోకి

క‌రోనా వైరస్ భారత అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐక్య‌రాజ్య‌సమ‌తి అభిప్రాయ‌ప‌డింది. ఈ రంగంలో పనిచేస్తున్న దాదాపు 40 కోట్ల మంది మరింత పేదరికంలో వెళ్లిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అంచనా వేసింది. దాదాపు 19.50కోట్ల ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయే అవ‌కాశం ఉందని లెక్కగట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) ”ఐఎల్‌ఓ మానిటర్‌: కొవిడ్‌-19 అండ్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ వర్క్‌” పేరిట ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. సెకండ్ వ‌ర‌ల్డ్ వార్ తర్వాత రోనా […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Apr 08, 2020 | 5:51 PM

క‌రోనా వైరస్ భారత అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐక్య‌రాజ్య‌సమ‌తి అభిప్రాయ‌ప‌డింది. ఈ రంగంలో పనిచేస్తున్న దాదాపు 40 కోట్ల మంది మరింత పేదరికంలో వెళ్లిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అంచనా వేసింది. దాదాపు 19.50కోట్ల ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయే అవ‌కాశం ఉందని లెక్కగట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) ”ఐఎల్‌ఓ మానిటర్‌: కొవిడ్‌-19 అండ్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ వర్క్‌” పేరిట ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. సెకండ్ వ‌ర‌ల్డ్ వార్ తర్వాత రోనా మహమ్మారే ప్ర‌పంచంలో అతిపెద్ద సంక్షోభమ‌ని ఈ నివేదిక అభివర్ణించింది. ఈ ప్ర‌మాదక‌ర స‌మయంలో నిర్ణ‌యాల్లో వేగంతో పాటు ప‌రిణితి కూడా ముఖ్య‌మ‌ని..అవే మ‌న‌ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని ఐఎల్‌ఓ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ గాయ్ రైడర్ త‌న అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. ఈ నివేదిక ప్ర‌కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ప్రతి ఐదుగురిలో నలుగురు ఎఫెక్ట్ అయ్యార‌ని అంచ‌నా.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu