రసకందాయంలో మునిసిపల్ ఎన్నికలు

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల పంచాయితీ రసకందాయంలో పడింది. జనవరి నాలుగు నాటికి రిజర్వేషన్లు ప్రకటించి.. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రారంభించేలా రాష్ట్ర ఎన్నికల అధికారి గతంలో వివరాలు వెల్లడించారు. అయితే, రిజర్వేషన్లను నోటిఫై చేసిన నెల రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జంధ్యాల రవిశంకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. జనవరి 7వ తేదీ మధ్యాహ్నం […]

రసకందాయంలో మునిసిపల్ ఎన్నికలు
Follow us
Rajesh Sharma

|

Updated on: Jan 03, 2020 | 3:02 PM

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల పంచాయితీ రసకందాయంలో పడింది. జనవరి నాలుగు నాటికి రిజర్వేషన్లు ప్రకటించి.. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రారంభించేలా రాష్ట్ర ఎన్నికల అధికారి గతంలో వివరాలు వెల్లడించారు. అయితే, రిజర్వేషన్లను నోటిఫై చేసిన నెల రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జంధ్యాల రవిశంకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.

జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు రిజర్వేషన్ల వివరాలను కోర్టుకు సబ్మిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని నిర్దేశించింది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వివరాలతో 8వ తేదీన కోర్టులో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. జనవరి ఇదివరకే ప్రకటించినట్లు ఏడవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందా ? లేక మరో షెడ్యూల్ని రూపొందించి జనవరి 8న కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళాలా అనే విషయంలో క్లారిటీ కనిపించడం లేదు.

ముందుగా ఖరారైన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 120 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్ల ఎన్నికలకోసం జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ ఉండాల్సి వుంది. జనవరి 10న నామినేషన్ల చివరి తేదీగా ఎన్నికల కమిషన్ తెలిపింది. కాగా.. జనవరి 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, జనవరి 14న ఉపసంహరణకు తుది గడువుగా కాగా.. జనవరి 22న పోలింగ్, జనవరి 25న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే తాజాగా కోర్టు ఆదేశాల మేరకు స్వల్ప మార్పులు చోటుచేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.