AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. దంపతుల దుర్మరణం

సూర్యాపేట‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. చివ్వెంల మండ‌లంలో విజ‌య‌వాడ‌ జాతీయ‌రహ‌దారిపై జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.

స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. దంపతుల దుర్మరణం
Balaraju Goud
|

Updated on: Aug 16, 2020 | 12:26 PM

Share

సూర్యాపేట‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. చివ్వెంల మండ‌లంలో విజ‌య‌వాడ‌ జాతీయ‌రహ‌దారిపై జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. జీ తిరుమ‌ల‌గిరి శివారులో శుక్ర‌వారం సాయంత్రం ఓ కారు ర‌హ‌దారి ప‌క్క‌నున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న పాల్వాయి అరుణ్ కుమార్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించగా, తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌ని భార్య ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది.

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా రుద్రంపూర్ గ్రామానికి చెందిన పాల్వాయి అరుణ్ కుమార్ త‌న భార్యా పిల్ల‌తో క‌లిసి జీ తిరుమ‌ల‌గిరిలోని అత్త‌గారింటికి వ‌చ్చాడు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మామ‌ను ప‌ల‌క‌రించేందుకు శుక్రవారం వచ్చారు. తిరిగి శ‌నివారం సాయంత్రం సొంతూరుకు ప‌య‌నమ‌య్యారు. తిరుమ‌ల‌గిరి శివారులోని రెండుప‌డ‌క గ‌దుల ఇండ్ల స‌మీపంలోకి రాగానే అదుపుత‌ప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో అరుణ్ అక్క‌డిక్క‌డే మ‌ృతి చెందాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌ని భార్య పుష్ప‌ల‌తను సూర్యాపేట జ‌న‌ర‌ల్ ఆస్పత్రికి త‌ర‌లించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదివారం ఆమె మరణించింది. ఏడేండ్ల కుమారుడు, 5 సంవత్సరాల కూతురు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల