మొబైల్‌ ఫోన్‌కే కరోనా పరీక్ష ఫలితాలు.. ఓటీపీ వచ్చాకే శాంపిళ్ల సేకరణ

కరోనా సంక్షోభ సమయంలో మెరుగైన సేవలు అందించేలా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మొబైల్‌ ఫోన్‌కే కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు రానున్నాయి. పాజిటివ్‌ అయినా, నెగెటివ్‌ అయినా

మొబైల్‌ ఫోన్‌కే కరోనా పరీక్ష ఫలితాలు.. ఓటీపీ వచ్చాకే శాంపిళ్ల సేకరణ

Coronavirus test reports to mobile: కరోనా సంక్షోభ సమయంలో మెరుగైన సేవలు అందించేలా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మొబైల్‌ ఫోన్‌కే కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు రానున్నాయి. పాజిటివ్‌ అయినా, నెగెటివ్‌ అయినా మొబైల్‌ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఫలితం పంపిస్తారు. దాంతోపాటు ఒక లింక్‌ను కూడా పంపిస్తారు. ఆ లింక్‌ను ఓపెన్‌ చేస్తే అందులో పూర్తి రిపోర్ట్‌ కనిపిస్తుంది. దాని ఆధారంగా పాజిటివ్‌ వచ్చిన కరోనా బాధితులు అవసరాన్ని బట్టి తక్షణమే ఆసుపత్రిలో చేరడం కానీ, ఐసోలేషన్‌కు వెళ్లడానికి కానీ వీలుకలుగుతుంది. నెగెటివ్‌ వచ్చినవారు ఇతర అనారోగ్య సమస్యలుంటే వాటి చికిత్సకు అవకాశం ఉంటుంది.

కోవిద్-19 నిర్ధారణకు చేసే టెస్టులో.. యాంటిజెన్‌ పరీక్ష చేయించుకుంటే అరగంట నుంచి గంటలోనే ఫలితాన్ని మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో పంపిస్తారు. ఇక ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుంటే 24 గంటల్లోగా ఎస్‌ఎంఎస్‌ వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొత్తగా ఈ పద్దతికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో యాంటిజెన్, ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో ఈ పద్ధతి ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. మొత్తం దాదాపు 1,100 సెంటర్లలో ఇదే పద్దతిలో ఎస్‌ఎంఎస్‌లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

Also Read: కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్‌ సెంటర్  

Click on your DTH Provider to Add TV9 Telugu