భూముల ధరలకు రెక్కలు.. ఆగస్టు 10నుంచి రిజిస్ట్రేషన్‌ ధరల పెంపు!

కరోనా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం  రిజిస్ట్రేషన్‌ ధరల పెంపునకు రంగం సిద్ధం చే సింది. ఏటా అమలుచేసే ఆగస్టు ఒకటో తేదీ నుంచి కాకుండా..  కరోనా నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీ

భూముల ధరలకు రెక్కలు.. ఆగస్టు 10నుంచి రిజిస్ట్రేషన్‌ ధరల పెంపు!

Hiked land prices: కరోనా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ధరల పెంపునకు రంగం సిద్ధం చేసింది. ఏటా అమలుచేసే ఆగస్టు ఒకటో తేదీ నుంచి కాకుండా..  కరోనా నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీ నుంచి ఈ పెంపును అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.

ఇక రాష్ట్రంలోని భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే రిజిస్ర్టేషన్ల శాఖ విలువల పెంపుపై కసరత్తు దాదాపుగా పూర్తిచేసింది. ఏయే సర్వే నంబర్లు, ఏ ప్రాంతాల్లో ఎంతెంత విలువలు పెంచాలని నిర్ణయం తీసుకుంటారో.. వాటన్నింటినీ రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో 15 రోజుల ముందే పెడతారు. దాన్ని ప్రజలు చూసుకోవచ్చు. అభ్యంతరాలు వ్యక్తమైన వాటిని మళ్లీ చార్జీల పెంపు కమిటీ ముందు పెట్టి…అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటారు.

Read More:

కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్‌ సెంటర్  

మొబైల్‌ ఫోన్‌కే కరోనా పరీక్ష ఫలితాలు.. ఓటీపీ వచ్చాకే శాంపిళ్ల సేకరణ

 

Click on your DTH Provider to Add TV9 Telugu