కరోనా వైరస్.. వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్లు..

|

Mar 21, 2020 | 3:19 PM

దేశమంతటా కరోనా వైరస్ భయం పట్టుకుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు షట్‌డౌన్ కాగా.. ఆ బాటలోనే మరిన్ని రాష్ట్రాలూ కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. విద్యాసంస్థలు, కాలేజీలు, థియేటర్లు, పార్కులు.. ఇలా అన్నింటినీ కూడా మూసివేశారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచి పని చేయాలని కోరిన సంగతి తెలిసిందే. దీనితో గత కొద్దిరోజులుగా ఇండియా అంతటా ఇంటర్నెట్ వినియోగం ఎక్కువయ్యింది. ఈ నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ […]

కరోనా వైరస్.. వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్లు..
Follow us on

దేశమంతటా కరోనా వైరస్ భయం పట్టుకుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు షట్‌డౌన్ కాగా.. ఆ బాటలోనే మరిన్ని రాష్ట్రాలూ కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. విద్యాసంస్థలు, కాలేజీలు, థియేటర్లు, పార్కులు.. ఇలా అన్నింటినీ కూడా మూసివేశారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచి పని చేయాలని కోరిన సంగతి తెలిసిందే. దీనితో గత కొద్దిరోజులుగా ఇండియా అంతటా ఇంటర్నెట్ వినియోగం ఎక్కువయ్యింది.

ఈ నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటి నుంచి పని చేసేవారికి అదనపు ప్రయోజనాలను కలిగిస్తూ నూతన 4జీ డేటా వోచర్లను తాజాగా ప్రకటించింది. 4జీ సౌకర్యంతో పాటుగా టాక్‌టైమ్‌ను రూ. 11 నుంచి రూ. 101 ప్లాన్స్ వరకు అందుబాటులో ఉంచింది. ఒకసారి అధిక వేగంతో డేటా ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్‌తో అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చునట.

ప్లాన్స్ ఇలా ఉన్నాయి…

  • రూ.11 – 800ఎంబీ డేటా.. 75 నిమిషాల టాక్‌టైమ్‌
  • రూ.21 – 2జీబీ డేటా.. 200 ని.టాక్‌టైమ్‌
  • రూ.51 – 6జీబీ డేటా.. 500 ని.టాక్‌టైమ్‌
  • రూ.101 – 12 జీబీ డేటా.. 1000 ని.టాక్‌టైమ్‌.. అయితే రూ.251 వోచర్‌కు మాత్రం అదే పాత ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

For More News:

డేంజర్ బెల్స్: తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు…

కరోనా ఎఫెక్ట్.. పెన్షన్ల పంపణీపై జగన్ కీలక నిర్ణయం..

కరోనా భయం.. పీఎస్‌లో గోదావరి కుర్రాడు..

కరోనా ప్రభావం.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్…

కరోనావైరస్: రసికప్రియులకు బ్యాడ్ న్యూస్.. ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ బంద్..

Breaking.. బస్సులు, మెట్రో బంద్..

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. ఎబోలా కంటే ప్రమాదకర స్థాయికి..

‘ఈరోస్ నౌ’ బంపరాఫర్.. 2 నెలలు ఫ్రీ సినిమాలు…

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్