ఏపీని వణికిస్తున్న కరోనా.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1813 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

ఏపీని వణికిస్తున్న కరోనా.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య..
Follow us

|

Updated on: Jul 11, 2020 | 5:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1813 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. వీటిల్లో రాష్ట్రానికి చెందినవి 1775 కేసులు కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 38 మందికి కరోనా తేలింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,235కి చేరింది.

కోవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 309కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,393కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 12,533 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ మొదలైనప్పటి నుంచి ఇవాళ్టి వరకు 11,36,225 సాంపిల్స్‌ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.

Also Read:

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటికే ఉచితంగా కిట్లు పంపిణీ..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..!

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

ఏపీ ప్రజలకు గమనిక.. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు.. ఇంటికే ఉచితంగా కరోనా కిట్..